E-Paper
Advertisement

మన్యం జిల్లాల విషాదం.. రైలు కింద పడి ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య!

మన్యం జిల్లాల విషాదం.. రైలు కింద పడి ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య!
Advertisement

Parvathipuram Manyam: ఆర్థిక ఇబ్బందులు ఓ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు నింపాయి. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం జగ్గునాయుడు పేట వద్ద జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బొబ్బిలి పట్టణానికి చెందిన చల్లపల్లి శ్రీను(60), ఆయన భార్య సింహాచలం(53), కుమారుడు రాజేశ్‌(25) కలిసి గూడ్స్‌ రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. కళ్లముందే నిండు ప్రాణాలు ఇలా తనువు చాలించడంతో ఆ ప్రాంతమంతా శోకసంద్రంగా మారింది.

సచివాలయ ఉద్యోగి రాజేశ్‌.. విషాదకర ముగింపు

Advertisement

మృతుల్లో కుమారుడు రాజేశ్‌ చినగంట్యాడలోని లక్కీడాం సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. చదువుకుని ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా నిలవాల్సిన యువకుడు, తల్లిదండ్రులతో కలిసి ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం అందరినీ కలిచివేసింది. అప్పులు, ఆర్థిక ఇబ్బందులే ఈ దారుణానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. బొబ్బిలిలో ఈ విషయం తెలియగానే బంధువులు, స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.

Also Read: విదేశీ ఉద్యోగాల కోసం సీఎం కొత్త పథకం.. పూర్తి వివరాలు ఇవే!

Tags

Related News

లోక్‌సభ సీట్ల పెంపునకు చంద్రబాబు మద్దతు.. దక్షిణాదికి అన్యాయం జరగొద్దని విజ్ఞప్తి

రుషికొండ ప్యాలెస్‌లోకి ప్రజలకు ఎంట్రీ.. చంద్రబాబు కీలక ఆదేశాలు!

డీలిమిటేషన్ బిల్లు అంశం.. ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు.. హస్తినకు సీఎం చంద్రబాబు- డిప్యూటీ సీఎం పవన్

విశాఖ హైవేపై భయానక ఘటన.. టైరు పేలి కారులో మంటలు, డ్రైవర్ సజీవదహనం!

మనసు మార్చుకున్న వైసీపీ అధినేత.. నోటీసుల విషయంలో జగన్ వెనక్కి? ఈసారి కారణమేంటి?

ఏపీలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు.. కూటమి మద్దతుదారుల జోరు, మరి వైసీపీ మాటేంటి?

ఏపీలో నిరుద్యోగులకు తీపికబురు.. 1534 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్, నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ

Big Stories

Advertisement
×