BigTV English

Dharali floods: 11 మంది జవాన్లు గల్లంతు.. మరో నలుగురు మృతి.. అక్కడ ఊరుఊరంతా..?

Dharali floods: 11 మంది జవాన్లు గల్లంతు.. మరో నలుగురు మృతి.. అక్కడ ఊరుఊరంతా..?

Dharali floods: ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీ జిల్లాలో ఆర్మీ క్యాంప్ బేస్ కొట్టుకుపోయింది. ఈ రోజు సంభవించిన భయంకరమైన క్లౌడ్ బరస్ట్‌ ధరాలీ గ్రామాన్ని జలప్రళయంలో ముంచెత్తింది. ఈ ప్రకృతి విపత్తు గంగోత్రీ సమీపంలోని ధరాలీలో కొండచరియలు విరిగిపడటానికి, ఆకస్మిక వరదలకు కారణమైంది. ఈ వరద బీభత్సం వల్ల ఊరు ఊరంతా పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో 100 మందికి పైగా గల్లంతయ్యారని, మరో నలుగురు మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. అయితే ఈ ధరాలీ వరదల్లో హర్సిల్ ఆర్మీ క్యాంప్ కొట్టుకుపోయింది. ఈ విషాదం మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది.


ఇదిగో వీడియో..

రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ.. 

భారీ వర్షాలు, ఈదురు గాలులతో కూడిన కుండపోత వర్షం ఖీర్ గంగా నదిని ఉప్పొంగేలా చేసింది. ఈ భారీ వరద బీభత్సం వల్ల ఇళ్లు, హోటళ్లు, రహదారులను కొట్టుకుపోయాయి. గ్రామమంతా అల్లకల్లోలం అయ్యింది.. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు NDRF, SDRF, ITBP బృందాలు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. 16 మంది ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసుల బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. భారత వాతావరణ శాఖ (IMD) ఆగస్టు 10 వరకు భారీ వర్షాలు, కొండచరియల ప్రమాదం ఉందని హెచ్చరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది.

ALSO READ: Farmers: సొంత భూమి ఉంటే చాలన్నా.. సింపుల్‌గా రూ.50వేలు పొందండిలా..?

కేంద్రం నుంచి పూర్తి సహాయం అందజేస్తాం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, కేంద్రం నుంచి పూర్తి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్వయంగా పరిస్థితిని సమీక్షించి, బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులను, సంబంధిత మంత్రిని ఆదేశించారు. స్థానికులు, పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే రహదారులు ధ్వంసమవడంతో సహాయకు చర్యలకు ఇబ్బంది తలెత్తుతోంది.

ALSO READ: Gold Mines: ఆ ప్రాంతంలో లక్షల టన్నుల బంగారం.. తవ్వే కొద్ది బయటపడుతోన్న గోల్డ్.. ఎక్కడో తెలుసా?

2013 వరదల తర్వాత అత్యంత ఘోర విపత్తు..

ఈ విపత్తు ఉత్తరాఖండ్‌లో పర్యాటక, యాత్రా కేంద్రాలకు ఆకర్షణ అయిన హిమాలయ ప్రాంతాల దుర్బలతను తెలియజేస్తోంది. 2013లో సంభవించిన వరదల తర్వాత ఇది అత్యంత ఘోరమైన విపత్తు అని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సెల్ఫీలు, సాహస కార్యకలాపాల కోసం ప్రాణాలను పణంగా పెట్టవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ALSO READ: Chiranjeevi Vs Mohan Babu: టాలీవుడ్‌లో ముందు అడుగు పెట్టింది ఎవరు? చిరంజీవా.. మోహన్ బాబా? ఇదేం కంపేరిజన్ సామి

Related News

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

UPS Deadline: UPSలోకి మారాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్-30 డెడ్ లైన్

India Vs Pakistan: ఇస్లామిక్ నాటో పైనే పాకిస్తాన్ ఆశలు.. భారత్‌కు ముప్పు తప్పదా?

Rahul Gandhi: భారత్‌లో కూడా జెన్- Z ఉద్యమం వస్తుంది.. రాహుల్ గాంధీ సంచలన ట్వీట్

Air India Flight: విశాఖ – హైదరాబాద్ విమానానికి.. తృటిలో తప్పిన ప్రమాదం

Uttarakhand Floods: ఉత్తరాఖండ్‌లో మళ్లీ వరద బీభత్సం.. కొండచరియలు విరిగి 10 మంది గల్లంతు

Kerala: కేరళలో కొత్త వైరస్.. 100 మందికి పైగా..?

Rahul Gandhi: ఎన్నికల సంఘంపై రాహుల్‌ విసుర్లు.. ఆధారాలు ఇవిగో, కీలక విషయాలు వెల్లడి

Big Stories

×