Farmers: భారతదేశంలో చాలా మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఈ వ్యవసాయం చేసే క్రమంలో రైతన్నల బాధ అంతా ఇంత కాదు. ఆరుగాలం కష్టపడతాడు. పొద్దంతా పని చేస్తూనే ఉంటాడు. కానీ చివరకు పంట పండి చేతికి డబ్బులు వచ్చే వరకు నమ్మకం ఉండదు. అతివృష్టి, అనావృష్టి సంభవించినా గోవిందా.. పెట్టిన పెట్టుబడి మొత్తం పోయినట్టే.. కొన్ని పంటలకు భారీగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తది.. తీరా చూస్తే ఒక్క రూపాయి రాదు.. దీంతో రైతన్న కుమిలిపోతాడు. రూ.లక్షల్లో నష్ట పోయే పరిస్థితి కూడా వస్తోంది. అయిన రైతన్నలు వ్యవసాయం చేయకుండా ఉంటారా..? అంటే మళ్లీ విత్తు వేసే సమయం వస్తది.. బరాబరి పంట పండించేదాకా నిద్రపోరు మన రైతన్నలు.
సొంత భూమి ఉంటే చాలు
ఈ క్రమంలోనే రైతన్నలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఆర్థిక బలోపేతం కోసం మంచి సబ్సిడీతో కూడిన పథకాలను అందజేస్తున్నారు. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, పూలు సాగు చేసే వారిని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఈ స్కీంలు రైతులకు మంచి లాభాలను సంపాదించే అవకాశాన్ని కల్పిస్తాయి. సొంత ల్యాండ్ ఉన్న వారు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే సబ్సిడీ పొందవచ్చును. ఆర్థికంగా ఎదగవచ్చు.
50 శాతం వరకు సబ్సిడీ
నేషనల్ హార్టికల్చర్ బోర్డు ద్వారా అందుబాటులో ఉన్న సబ్సిడీతో కూడిన స్కీంలు రైతన్నలకు గొప్ప వరం లాంటివి అని చెప్పవచ్చు. రక్షిత సాగు కింద గ్రీన్ హౌస్, నెట్ హౌస్ లాంటి ఆధునిక సౌకర్యాలతో టమాట, క్యాప్సికం, గులాబీ లాంటి పంట పండిస్తే 1.12 కోట్ల వరకు నిధులు మంజూరు అవుతాయి.. ఇందులో 50 శాతం వరకు సబ్సిబీ పొందవచ్చు. ఈ డబ్బులతో వడగళ్లు, ఈదురు గాలుల, పక్షులు, జంతువుల నుంచి పంటలు కాపాడే వలలు, నీటి పారుదల వ్యవస్థ, ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు.
ఈ పంటలకు రూ.75లక్షల వరకు మంజూరు
బత్తాయి, మామిడి, నిమ్మ, అరటి వంటి పండ్ల తోటలకు ఐదు ఎకరాలకు రూ.75 లక్షల వరకు నిధులు మంజూరు చేసుకోవచ్చు. ఇందులో 40 శాతం సబ్సిడీగా అందుతుంది. ఈ డబ్బును బిందు సేద్యం, యంత్రాల కొనుగోలు, పంట ప్యాకింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలాంటి చక్కటి అవకాశాన్ని రైతన్నలు సద్వినియోగం చేసుకోండి.
ఫ్రీగా రూ.50 పొందండిలా
అలాగే.. పంట నిల్వ కోసం కోల్డ్ స్టోరేజీలు, ప్యాక్‌హౌస్‌ల నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేసుకోవచ్చు. రూ.1.45 కోట్ల వరకు నిధులకు గానూ 30 శాతం సబ్సిడీ లభిస్తుంది. ఇక ఆయిల్ పామ్ సాగుకు ప్రత్యేక పథకం కింద ఒక హెక్టారుకు 143 మొక్కలను ఫ్రీగా ఇవ్వనున్నారు. మొదటి నాలుగేళ్లు అంతర పంటలకు ఏడాదికి రూ.5250 చొప్పున సబ్సిడీ ఉండనుంది. ఇక చిన్న రైతులకు 20 గుంటలలో తీగజాతి కూరగాయలకు గానూ పందిరి సాగు చేసుకునేందుకు రూ.50 వేల వరకు సహాయం అందనుంది.
అప్లికేషన్ ప్రాసెస్..
ఈ అప్లికేషన్ ప్రాసెస్ చాలా ఈజీ.. ఎన్‌హెచ్‌బీ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు..
అప్లికేషన్: వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్‌లో…
వెబ్ సైట్: www.nhb.gov.in
ఉండాల్సినివి: ఆధార్, పాన్ కార్డ్
బ్యాంక్ నుంచి రుణం తీసుకుంటున్నట్టు ఓ లేఖ, సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక సమర్పించవచ్చు..
సందేహాలుంటే: హైదరాబాద్, ఎన్‌హెచ్‌బీ కార్యాలయంలో వివరాలు తెలుసుకోండి.
ఈ పథకాల గురించి గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.
ALSO READ: Gold Mines: ఆ ప్రాంతంలో లక్షల టన్నుల బంగారం.. తవ్వే కొద్ది బయటపడుతోన్న గోల్డ్.. ఎక్కడో తెలుసా?