Gold Mines: భారతదేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా మన దేశంలో స్త్రీలు బంగారం అంటే చాలా ఇష్టపడతారు. బంగారం ధరలు భారీ తగ్గాయని వార్తలు వస్తే.. వారికున్నంతా సంబరం మరెవరికీ ఉండదు. కాకపోతే గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతున్నారు. ప్రస్తుతం తులం బంగారం లక్ష రూపాయలు ఉంది. అంటే బంగారానికి మన దేశంలో ఎంత డిమాండ్ ఉందో అర్థం అవుతోంది. ప్రస్తుతం సామాన్యులు బంగారం కొనాలంటే ధరలను భయపడుతున్నారు. బంగారం ధరలు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూస్తున్నారు. దేశంలో కర్నాటక, ఏపీ, యూపీ, రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్ పలు రాష్ట్రాల్లో బంగారు గనులు ఉన్నాయి. తాజాగా కొన్ని ప్రాంతాల్లో భారీ బంగారు గనులు ఉన్నట్టు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
జబల్‌పూర్‌లో భారీగా బంగారు గనులు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్ నగరం భూగర్భంలో లక్షల టన్నుల బంగారం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. భూ వివిజ్ఞాన సైంటిస్టులు పరిశోధనలు చేశారు. వారు సేకరించిన నమూనా నివేదికల ప్రకారం అక్కడ స్పష్టంగా బంగారు గనులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ బంగారు నిక్షేపాలు సిహోరా తాలుకాలోని మహాంగ్వా కేవల్రి ప్రాంతంలో పరిశోధకులు గుర్తించారు. ఇప్పటికే జబల్‌పూర్ నగరం ఇనుము, మాంగనీస్ ఖనిజాలకు ప్రసిద్ధి గాంచింది. తాజాగా కొత్త బంగారు నిక్షేపాలు ఉన్నట్టు తేలడంతో.. జబల్‌పూర్ నగరం మరింత ప్రాధాన్యతను సంతరించుకోనుంది. దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది.
100 హెక్టార్ల విస్తీర్ణంలో బంగారు నిక్షేపాలు
జబల్‌పూర్ నగరం సమీపంలోని మహాంగ్వా కేవల్రి ప్రాంతంలో భారీ బంగారు నిక్షేపాలు ఉన్నట్టు భౌగోళిక సర్వే ద్వారా సైంటిస్టులు తేల్చి చెప్పారు. ఈ ఆవిష్కరణ జరిగిన అనంతరం ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గణనీయంగా మార్చేందుకు ఇదే మంచి పరిణామం అని భావిస్తోంది. సుమారు 100 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ గనులలో బంగారంతో పాటు రాగి ఇతర విలువైన ఖనిజాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ గనులు జబల్‌పూర్ నగరంతో పాటు రాష్ట్రాన్ని ఆర్థిక కేంద్రంగా మార్చేందుకు ఇది మంచి సమయం. జబల్ పూర్ నగరంలోని ఈ బంగారు నిక్షేపాలు దేశంలో గోల్డ్ ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఎక్కువగా ఉంది.
గోల్ట్ సిటీగా జబల్‌పూర్
మామూలుగా భారతదేశంలో బంగారం ఉత్పత్తిలో కర్ణాటక రాష్ట్రం ఎక్కువగా పేరొందింది. తాజాగా జబల్‌పూర్ నగరంలోని ఈ కొత్త ఆవిష్కరణ మధ్యప్రదేశ్‌ను కూడా బంగారం రంగంలో ముందంజలో నిలిపే ఛాన్స్ ఉంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF) లాంటి చారిత్రక గనులు గతంలో దేశ బంగారు ఉత్పత్తికి చాలా దోహదపడ్డాయి. అలాగే జబల్‌పూర్ గనులు కూడా భవిష్యత్తులో ముఖ్యమైన ఆర్థిక వనరుగా మారేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంది.. ఈ గనుల నుంచి సంపద వెలికితీయడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన మార్పు రావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వేలాది మందికి ఉపాధి అవకాశాలు
ఈ బంగారు నిల్వలు కేవలం ఆర్థిక విలువను మాత్రమే కాకుండా, స్థానికంగా ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తాయని చాలా మంది భావిస్తున్నారు. బంగారు నిక్షేపాలు కనుగొనడంతో జబల్ పూర్ కు చెందిన వేలాది మంది కార్మికులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఇది జబల్‌పూర్ ప్రాంతంలోని గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మార్చేస్తోంది. అయితే.. బంగారు గనుల తవ్వకం వల్ల పర్యావరణంపై సంభవించే ప్రభావం గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గతంలో కోలార్ గనులు మూతపడడానికి ఖర్చు, బంగారం శాతం తగ్గడం వంటి పలు కీలక కారణాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. జబల్‌పూర్‌లో బంగారు నిక్షేపాల కోసం తవ్వకాలు సమర్థవంతంగా, పర్యావరణ హితంగా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇది అమలులోకి వస్తే భారత్ భవిష్యత్తు బంగారమే
ఈ కొత్త బంగారు నిక్షేపాల ఆవిష్కరణ దేశ బంగారు నిల్వలను పెంచడంలోనూ, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంలోనూ ఎంతోగానూ తోడ్పడనుంది. ప్రస్తుతం భారతదేశం సంవత్సరానికి సుమారు 800 నుంచి 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోంది. జబల్‌పూర్ గనుల ద్వారా స్వదేశీ బంగారం ఉత్పత్తి పెరిగితే, ఈ భారం కాస్త తగ్గుతుంది. అంతేకాక, ఈ గనులు ప్రపంచ బంగారు మార్కెట్‌లో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేస్తాయి.మహాంగ్వా కేవల్రి ప్రాంతంలోని ఈ బంగారు గనులు జబల్‌పూర్‌కు కొత్త గుర్తింపును తెచ్చిపెడతాయి. ఈ ఆవిష్కరణ ద్వారా ఆర్థిక, సామాజిక అభివృద్ధికి బాటలు వేయడంతో పాటు, దేశ సంపదను పెంచే దిశగా ఒక ముందడుగు వేయవచ్చు.
ALSO READ: DSSSB Jobs: సబార్డినేట్ సర్వీసెస్‌లో 615 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు