OTT Movie : కొరియన్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనంత మంది అభిమానులు ఉన్నారు. అందులోనూ లవ్ స్టోరీలు అంటే పడిచచ్చే మూవీ లవర్స్ కు కొదవే లేదు. కానీ లవ్ స్టోరీకి యాక్షన్ తోడైత్ ఇక పండగే. మీరు కూడా ఇలాంటి సినిమానే వెతుకుతున్నారా ? అయితే ఈ మూవీ మీ కోసమే. మరి ఈ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీని ఎక్కడ చూడొచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.
రెండు ఓటీటీలలో అందుబాటులో…
ఈ కొరియన్ యాక్షన్ లవ్ స్టోరీ సిరీస్ పేరు ‘Healer’ (2014-2015). ఇందులో యాక్షన్, లవ్ స్టోరీకి కొంచెం కామెడీ కూడా మిక్స్ అయ్యి ఉండడం విశేషం. ఈ సిరీస్ గతంలో జరిగిన ఒక సంఘటన చుట్టూ తిరుగుతుంది. 20 ఎపిసోడ్‌ల ఈ సిరీస్ కు లీ జంగ్-సబ్, కిమ్ జిన్-వూ దర్శకత్వం వహించారు. 2014 డిసెంబర్ నుండి 2015 ఫిబ్రవరి వరకు ప్రసారమైన ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
ఇందులో జి చాంగ్-వూక్ (సియో జంగ్-హూ/హీలర్), పార్క్ మిన్-యంగ్ (చే యంగ్-షిన్), యూ జి-తే (కిమ్ మూన్-హో), కిమ్ మి-క్యుంగ్ (జో మిన్-జా, హ్యాకర్), ఓహ్ క్వాంగ్-రాక్ (కి యంగ్-జే, జంగ్-హూ గురువు), డో జి-వోన్ (చోయ్ మ్యాంగ్-హీ, యంగ్-షిన్ తల్లి), పార్క్ సాంగ్-వోన్ (కిమ్ మూన్-సిక్, మూన్-హో సోదరుడు) ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ కొరియాలో కంటే విదేశాల్లో భారీ ఫ్యాన్‌బేస్ సంపాదించింది. అంతేకాదు యాక్టర్ జి చాంగ్-వూక్‌ను అంతర్జాతీయంగా పాపులర్ చేసింది. అలాగే 2014-2015లో టాప్ కొరియన్ డ్రామాలలో ఒకటిగా నిలిచి రికార్డు క్రియేట్ చేసింది. .
స్టోరీలోకి వెళ్తే…
సియో జంగ్-హూ (జి చాంగ్-వూక్) “హీలర్” అనే కోడ్‌నేమ్‌తో పనిచేసే ఒక రహస్య నైట్ కొరియర్ గా పని చేస్తాడు. అతను ఒక అద్భుతమైన ఫైటర్. హై-టెక్ గాడ్జెట్స్, ఒక హ్యాకర్ సహాయంతో ఏ జాబ్ అయినా చేస్తాడు. కానీ హత్య లేదా కిడ్నాప్ జోలికి మాత్రం వెళ్లడు. కొత్త జాబ్‌లో అతను చే యంగ్-షిన్ (పార్క్ మిన్-యంగ్) అనే ఒక చిన్న ఆన్‌లైన్ న్యూస్ రిపోర్టర్‌ను ఫాలో చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్‌ను ఒక ఫేమస్ జర్నలిస్ట్ కిమ్ మూన్-హో (యూ జి-తే) ఇస్తాడు. అతను 1992లో జరిగిన ఒక సీరియల్ కిల్లింగ్ కేసు గురించి నిజం తెలుసుకోవాలనుకుంటాడు.
Read Also : ఫస్ట్ నైట్ రోజే పైకి పోయే నూతన వధువులు… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్… ప్రతీ సీన్ క్లైమాక్స్ లా…