Big Stories

Drug Racket: 2 వేల కోట్ల డ్రగ్ రాకెట్ గుట్టురట్టు.. తమిళ నిర్మాతే మాస్టర్‌మైండ్..

Tamil Film Producer Mastermind In Drug Racket
Tamil Film Producer Mastermind In Drug Racket

Tamil Film Producer Mastermind In Drug Racket:  దేశంలో మరో భారీ డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టయ్యింది. ఢిల్లీ పోలీసులు, ఎన్‌సీబీ చేపట్టిన ఆపరేషన్‌లో అంతర్జాతీయ డ్రగ్‌ నెట్‌వర్క్‌ను అధికారులు చేధించారు. ఈ డ్రగ్ ముఠా వ్యవహారంలో తమిళనాడులోని ఓ ప్రముఖ సినీ నిర్మాత కీలక సూత్రధారిగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీ ఉన్నట్లు సమాచారం.

- Advertisement -

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూడోపెడ్రిన్‌కు ఇతర దేశాల్లో డిమాండ్‌ ఎక్కువ. మెథాంఫేటమిన్ తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలో సూడోపెడ్రిన్ ను కిలో రూ. 1.5 కోట్లకు విక్రయిస్తున్నారు. ఆ దేశాలకు పెద్ద మొత్తంలో సూడోపెడ్రిన్‌ పంపుతున్నట్లు ఎన్‌సీబీ సమాచారం అందింది. దీనిని హెల్త్‌ మిక్స్‌ పౌడర్స్‌, కొబ్బరి సంబంధిత ఆహారంలో కలిపి సముద్ర మార్గాల్లో రవాణా చేస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో ఈ డ్రగ్‌ మాఫియా కదలికలపై ఎన్‌సీబీ అధికారులు నిఘా పెట్టారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో సరకును ఆస్ట్రేలియాకు పంపడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ఫిబ్రవరి 15న పశ్చిమ ఢిల్లీలోని దారాపుర్‌లోని గోదాంలో తనిఖీలు చేపట్టారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేశారు. వీరి నుంచి దాదాపు 50 కిలోల సూడోపెడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నాట్లు తెలిపారు. ఈ నెట్‌వర్క్‌ భారత్‌ సహా మలేషియా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలకు విస్తరించినట్లు ఎన్‌సీబీ విచారణలో తేలింది.

ఈ ముఠా ఇప్పటి వరకు 3,500 కిలోల సూడోఫెడ్రిను ఎగుమతి చేశారని.. దాని విలువ సుమారు రూ. 2 వేల కోట్లకు పైగా ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ డ్రగ్ ముఠా వ్యవహారంలో తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు ఎన్‌సీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే అతడి ఫొటోను విడుదల చేస్తామని పోలీస్‌ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News