Big Stories

Shut Down Google Pay Service: గూగుల్ సంచలన నిర్ణయం.. అక్కడ గూగుల్ పే క్లోజ్..!

google

- Advertisement -

Google Pay Services Closed in America: యూపీఐ పేమెంట్ చేయాలంటే ముందుగా మనకు గుర్తోచ్చేవి.. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం. ఈ నేపథ్యంలోనే సెంట్రల్ బ్యాంకులు ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు వైపు దృష్టి సారిస్తున్నాయి. అంతేకాకుండా భారత్ తన యూపీఐ పేమెంట్స్ వ్యవస్థను విజయవంతంగా అమలు చేసింది. అలానే ఇతర దేశాలకు కూడా విస్తరింపజేస్తోంది.

- Advertisement -

ఇందులో భాగంగానే గూగుల్ తన పేమెంట్స్ యాప్ గూగుల్ పేను అనేక దేశాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. మొదటిలో క్యాష్‌బ్యాకులు కూడా కస్టమర్లకు వచ్చేది. అయితే ప్రస్తుతం గూగుల్ పే తన సేవలను అమెరికాలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యాప్ యూసేజ్ సులభతం చేయడానికి, వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ ప్రకటించింది.

దీంతో అమెరికాలోని వినియోగదారుల వాలెట్‌కు నగదు బదిలీ చేయబడుతుందని సంస్థ పేర్కొంది. తిరిగి గూగుల్ పే యాప్ జూన్ 4, 2024 నుంచి అందుబాటులో ఉంటుందని వినియోగదారులకు వెల్లడించింది. నిజానికి అమెరికాలో గూగుల్ పే వినియోగం కంటే గూగుల్ వాలెట్ వినియోగించే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ట్రాన్సిట్ కార్డ్‌లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, స్టేట్ ఐడీలతో పాటు ట్యాప్ పేమెంట్స్ కోసం గూగుల్ వాలెట్ విజయవంతగా కొనసాగుతోంది.

Read More: అమెరికాలో జాబ్ వదిలేసి.. స్టార్టప్‌తో రూ.100 కోట్లు..!

అయితే గూగుల్ పేకు అమెరికాతో పాటు ఇండియా, సింగపూర్‌లో భారీగా యూజర్లు ఉన్నారు. గూగుల్ పే సేవలు భారత్, సింగపూర్‌లో యధావిధిగా కొనసాగతాయని గూగుల్ ప్రకటించింది. భారత్‌లో గూగుల్ పే కస్టమర్లు భారీగానే ఉన్నారు.

యూపీఐ యాప్స్‌లో భారత్‌లొ మొదటి స్థానంలో ఫోన్ పే ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో గూగుల్ పే ఉంది. ఇక యూపీఐ పేమెంట్లలో ప్రపంచంలోనే భారత్ మొదటి స్ధానంలో ఉంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీలలో అసాధారణమైన పెరుగుదలను భారత్ నమోదు చేసింది.

Read More: వీడు మామూలోడు కాదు.. భార్య ఫోన్ కాల్స్‌తో రూ.15 కోట్లు కొట్టేశాడు..!

మన దేశంలో డిజిటల్ పేమెంట్స్ డిసెంబర్ 11, 2023 నాటికి 8,572 కోట్లకు చేరుకుంది. ఇది డిజిటల్ లావాదేవీల వైపు గణనీయమైన మార్పును తెలియజేస్తుంది. ఈ వృద్ధి పెద్ద ట్రెండ్‌లో భాగం, UPI లావాదేవీలు FY 2017-18లో 92 కోట్ల నుండి 2022-23 FYలో 8,375 కోట్లకు పెరిగాయి. వాల్యూమ్ పరంగా 147% వార్షిక వృద్ధి రేటు (CAGR)ని ఉంది.. యూపీఐ పేమెంట్లు 2017-18లో రూ.1 లక్ష కోట్లు ఉండగా.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.139 లక్షల కోట్లకు చేరింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News