BigTV English

North India Floods : వణుకుతున్న ఉత్తరభారతం.. వర్షాలు లేకున్నా వరదలు.. 56 మంది మృతి

North India Floods : వణుకుతున్న ఉత్తరభారతం.. వర్షాలు లేకున్నా వరదలు.. 56 మంది మృతి

Assam flood latest news(Telugu breaking news): భారీ వర్షాలు ఒకవైపు.. వర్షాలు లేకపోయినా వరదలు మరొకవైపు.. ఉత్తరభారతం భారీ వర్షాలు, వరదలతో వణికిపోతోంది. మేఘాలయ, అస్సాం రాష్ట్రాలు భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యాయి. అనేక ప్రాంతాల్లో వర్షాలు లేకున్నా.. వారంరోజుల క్రితం కురిసిన వర్షాలే వరదలయ్యాయి. ఆ వరదల ప్రభావం ఇంకా ఆయా ప్రాంతాల్లో కొనసాగుతోంది. భారీగా వర్షాలు కురవడం, వర్షపునీరు నిలవడంతో.. కరెంట్ కోతలున్నాయని చెబుతున్నారు.


అస్సాంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బుధవారం వరదల కారణంగా మరో 8 మంది మరణించడంతో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 56కు చేరింది. బుధవారం సోనిత్ పుర్ జిల్లా తేజ్ పుర్ లో 2, మోరిగావ్, దిబ్రుగఢ్, దరాంగ్, గోలాఘాట్, బిస్వనాథ్, తిన్ సుకియా ప్రాంతాలలో ఒక్కొక్కరు మృతి చెందినట్లు తెలిపారు. 27 జిల్లాల్లో 16 లక్షల 25 వేల మంది నిరాశ్రయులయ్యారు. వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన 515 సహాయక శిబిరాలలో నాలుగు లక్షల మంది ఉన్నారు.

Also Read :ఢిల్లీలో 88 ఏళ్లలో ఎప్పుడూ లేనంత వర్షపాతం నమోదు.. ఐఎండీ హెచ్చరిక ఇదే..


వరదలలో చిక్కుకున్న 8400 మందిని సహాయక బృందాలు కాపాడాయి. వరదల కారణంగా అస్సాంలో 42,478 హెక్టార్లలో పంటలు నీటమునిగాయి. వివిధ జిల్లాల్లో రోడ్లు, వంతెనలు తెగిపోవడంతో.. రాకపోకలకు అంతరాయం కలిగింది. కజిరంగ నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్ కేంద్రాల్లోకి వరదనీరు చేరి.. ఐదు అడుగుల మేర ప్రవహిస్తుండటంతో.. ఒక ఖడ్గమృగం సహా 8 జంతువులు మృతి చెందినట్లు తెలిపారు. పార్కుల్లో ఉన్న జంతువులను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించాలని సీఎం హిమంత బిశ్వశర్మ ఆదేశించారు. అలాగే గాయాలైన జంతువులకు వెంటనే చికిత్స అందించాలని చెప్పారు.

ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ వాతావరణం మారింది. గడిచిన నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురవగా.. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో చలిగాలులు వీస్తున్నాయి. ఒక్కసారిగా మారిన వాతావరణానికి ప్రజలు.. సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. ఎక్కడ చూసిన వైరల్ ఫీవర్ బాధితులే కనిపిస్తున్నారు. ఆస్పత్రులన్నీ ఫీవర్ బాధితులతో నిండిపోతున్నాయి.

Related News

Bihar Bidi: బీహారీల బీడీ.. ఆ పోలికతో చిక్కుల్లో పడ్డ కాంగ్రెస్.. అసలే ఎన్నికల సమయం!

GST Reforms: వన్ నేషన్ – వన్ ట్యాక్స్ అందుకే సాధ్యం కాదు -నిర్మలా సీతారామన్

Mumbai High Alert: గణేష్ నిమజ్జనం సందర్భంగా బాంబు బెదిరింపు.. నగర వ్యాప్తంగా హై అలర్ట్

Russian Oil: ఈయూ దేశాలకు పెరిగిన భారత్ డీజిల్ ఎగుమతులు

Delhi-NCR Earthquake: ఆఫ్ఘాన్ ఎఫెక్ట్ ఢిల్లీని తాకింది.. మళ్లీ భూప్రకంపనల భయం

America Cool Drinks: అమెరికా కూల్ డ్రింక్స్ ఇక బంద్.. ఆ రాష్ట్రంలోని హోటళ్లు కీలక నిర్ణయం

Big Stories

×