BigTV English

Joe Biden presidential race: బైడెన్ క్లారిటీ, రేసులో ఉన్నా.. గెలుపు మనదే అంటూ..

Joe Biden presidential race: బైడెన్ క్లారిటీ, రేసులో ఉన్నా.. గెలుపు మనదే అంటూ..

Joe Biden in US president elections(International news in telugu): ఎట్టకేలకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ వైపు క్లారిటీ వచ్చే సింది. తాను రేసులోనే ఉన్నానని అధ్యక్షుడు జో బైడెన్ క్లారిటీ ఇచ్చేశారు. పోటీ నుంచి వైదొలగాలని తనపై ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. ఈ మేరకు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి.


అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకోవడం లేదని వైట్‌హౌస్ వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన రాజకీయ జీవితంలోనే ఉన్నారని పేర్కొంది. ట్రంప్‌తో జరిగిన తొలి డిబేట్‌లో అధ్యక్షుడు బైడెన్ తడబాటుపైనా ప్రస్తావించింది. ఇలాంటి ఆందోళనలను సహజమని, గతంలో ఆయన పని తీరును గమనించాలని సూచన చేసింది.

మరో నాలుగేళ్లపాటు బైడెన్ సమర్థంగా పని చేస్తారని భావిస్తున్నట్లు అధికార ప్రతినిధి కరీన్ జీన్ పియర్ గుర్తు చేశారు. రాజకీయ నేతల్లో ఆయనకున్న అనుభవం, మరెవరికీ లేదన్నారు. బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి ఆయన ఇంకా పని చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. వైట్‌హౌస్‌లో మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. బైడెన్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారా? ఆయన స్థానంలో కమలా హ్యారిస్ బాధ్యతలు స్వీకరిస్తారా? అంటూ పలు ప్రశ్నలు లేవనెత్తారు.


పార్టీ మద్దతుదారులకు రాసిన లేఖలో అధ్యక్షుడు జో బైడెన్ కీలక విషయాలు బయటపెట్టారు. డెమోక్రటిక్ పార్టీ నామినీ తానేనని, తనను ఎవరూ తప్పుకోమనలేదన్నారు. పోటీ నుంచి వైదొలగడం లేదన్నారు. తుది వరకు పోరాడుతానని, గెలుపు మనదేనని అందులో పేర్కొన్నారు. జీవితంలో తాను చాలాసార్లు కిందపడ్డానని, ప్రతీసారి పైకి లేచి పోరాటం చేశారని వివరించారు.

ఎంత వేగంగా కోలుకున్నామనేది ముఖ్యమన్నారు అధ్యక్షుడు జో బైడెన్. వెనుకబడిన ప్రతీసారి పుంజుకుని తానేంటో నిరూపించుకున్నానని, ఇప్పుడు అదే చేయబోతున్నానని తెలిపారు. గతంలో మాదిరిగానే కమలాహ్యారిస్‌తో కలిసి ఈసారీ ట్రంప్‌ను ఓడించనున్నట్లు అందులో రాసుకొచ్చారు.

ALSO READ: పెద్దన్న పీఠం కోసం ఉద్ధండ పిండాల పోటీ.. అమెరికాలో ఏం జరుగుతోంది ?

గతవారం అధ్యక్ష అభ్యర్థుల మధ్య తొలి డిబేట్‌ జరిగింది. అందులో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్ లేవనెత్తిన పలు ప్రశ్నలకు బైడెన్ నీళ్లు మింగారు. ఈ క్రమంలో బైడెన్ గెలుపుపై సొంత పార్టీలో నిరసనలు మొదలయ్యాయి. ఆయన్ని కచ్చితంగా తప్పించాలన్న డిమాండ్ నేపథ్యంలో నేరుగా పార్టీ మద్దతుదారులకు అధ్యక్షుడు జో బైడెన్ లేఖ రాశారు.

Tags

Related News

Donald Trump: నా జానే జిగర్ మోదీ! వెనక్కి తగ్గిన ట్రంప్..

Afghan Women: అఫ్ఘాన్ భూకంప శిథిలాల్లో మహిళలు.. బతికున్నా రక్షించకుండా వదిలేసిన మగాళ్లు!

MRI Accident: మెడలో మెటల్ చైన్‌తో ఎంఆర్ఐ గదిలోకి.. క్షణాల్లో ప్రాణం గాలిలోకి.. ఎక్కడంటే?

Donald Trump: భారత్‌తో సంబంధాలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు… కుట్రబుద్ధి ఉన్న చైనాతో..?

Putin: 150 ఏళ్లు బతకొచ్చు.. ఎలాగంటే..! పుతిన్ చెప్పిన సీక్రెట్స్..

China Military Parade: ఆ ముగ్గురు కలిస్తే తట్టుకోవడం కష్టమే.. భయంలో ట్రంప్

Big Stories

×