BigTV English

Trump VS Nikki : యూఎస్ ప్రెసిడెంట్ రేసులో ట్రంప్ దూకుడు.. నిక్కీని తప్పుకోమంటున్న రిపబ్లికన్లు

Trump VS Nikki : యూఎస్ ప్రెసిడెంట్ రేసులో ట్రంప్ దూకుడు.. నిక్కీని తప్పుకోమంటున్న రిపబ్లికన్లు

Trump VS Nikki : యూఎస్ ప్రెసిడెంట్ ఎన్నికల కోసం రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వ రేసులో డొనాల్డ్‌ ట్రంప్‌ టాప్ గేరులో దూసుకుపోతున్నారు. ఇప్పటికే అయోవా ప్రైమరీలో గెలిచిన ఆయన తాజాగా న్యూ హాంప్‌షైర్‌లోనూ ఆధిక్యంలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తి కాకపోయినా.. ఆయన గెలుపు ఖాయంగా పార్టీ నేతలు చెబుతున్నారు. అంతే కాదు.. స్థానిక మీడియా కూడా ట్రంప్ గెలిచినట్టు వార్తల రాస్తోంది.


భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ ట్రంప్‌నకు గట్టి పోటీ ఇచ్చారు. నిక్కీ హేలీ తన సొంత ప్రాంతమైన దక్షిణ కరోలినాలో కూడా ట్రంప్ కంటే వెనకబడ్డారు. అయితే, ట్రంప్ తక్కువ మెజార్టీతోనే ముందుజలో ఉన్నారు. కానీ.. మిగిలిన రాష్ట్రాల్లో ట్రంప్‌కు తిరుగుండదని రిపబ్లికన్ పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకే నిక్కీ హేలీని పోటీ తప్పుకోవాలని కోరుతున్నారు. న్యూ హాంప్‌షైర్‌ ప్రైమరీలో వరుసగా మూడుసార్లు గెలిచిన రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్ ఒక్కరేనని వివేక్‌ రామస్వామి అన్నారు. ఈ దశలోనే హేలీ పోటీ నుంచి పక్కకు జరిగి ట్రంప్‌నకు మద్దతు ప్రకటిస్తే మంచిదని చెప్పారు. ఇలాగే రేసులో కొనసాగితే ప్రత్యర్థి పార్టీ విజయానికి అవకాశం ఇచ్చినట్టు అవుతోందని రిపబ్లికన్లు చెబుతున్నారు.

నిక్కీ హేలీ మాత్రం ససేమిరా అంటున్నారు. పోటీ ఇంకా తొలి దశలోనే ఉందని.. ఇంకా చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయని నిక్కి తెలిపారు. 14 మంది పోటీకి దిగితే చివరికి తాను మాత్రమే పోరాడుతున్నానని అన్నారు. డెమొక్రాట్లు కూడా ట్రంపే అభ్యర్థిగా ఉండాలనుకుంటున్నారని.. అదే జరిగితే పార్టీ ఓడిపోతుందని నిక్కీ హెలీ చెప్పారు. నిక్కీ మొండిగా వెళ్తున్నా.. ట్రంప్ మాత్రమే అభ్యర్థి రేసులో చివరికి మిగులుతారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.


Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×