Fancy Number: కొందరికి ఫ్యాన్సీ నంబర్ల మోజు ఉంటుంది. ఎంతంటే.. ఆ నంబర్ కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడనంత. కోట్ల రూపాయలను కుమ్మరించి ఫ్యాన్సీ నంబర్లను దక్కించుకుంటారు. ఫ్యాన్సీ నంబర్ల పేరుతో ప్రతి ఏడాది రవాణా శాఖ ఖజానాకు కోట్ల రూపాయల అదనపు సంపాదన వచ్చి చేరుతోంది.
ఇలాగే హిమాచల్ ప్రదేశ్‌లో ఓ వ్యక్తి ఫ్యాన్సీ నంబర్ కోసం ఏకంగా కోటి రూపాయలు పెట్టడానికి ముందుకొచ్చాడు. ఇటీవల శిమ్లాలో హెచ్‌పీ 999999 అనే నంబర్‌ను రావాణా శాఖ వేలానికి పెట్టింది. దాని రిజర్వు ధరను రూ.1,000గా నిర్దారించింది. ఆ నంబర్‌ను దక్కించుకోవడానికి చాలా మంది పోటీ పడగా.. ఓ వ్యక్తి ఏకంగా రూ. 1,00,11,000కు బిడ్ దాఖలు చేశాడు.
అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాడంటే.. దాన్ని అమర్చబోయే కారు ఏ బీఎండబ్ల్యూ, ఆడి, బెంజ్ అనుకునేరు.. అస్సలు కాదు. ఇటీవల అతడు కొనుగోలు చేసిన స్కూటీ కోసం. దాని ధర కేవలం లక్ష రూపాయాలు. ఆ నంబర్ కోసం పెట్టే డబ్బులతో అలాంటి స్కూటీలను 100 కొనుగోలు చేయొచ్చు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరలవుతోంది. నెటిజన్లు.. దాని బదులుగా ఓ లగ్జరీ కారు కొనుక్కోవచ్చు కదా అని కామెంట్లు పెడుతున్నారు.