BigTV English

A Mother Throws 6 Years Son Crocodile Infested River: దంపతుల మధ్య గొడవ, ఆరేళ్ల కొడుకుని మొసలికి ఇచ్చిన తల్లి

A Mother Throws 6 Years Son Crocodile Infested River: దంపతుల మధ్య గొడవ, ఆరేళ్ల కొడుకుని మొసలికి ఇచ్చిన తల్లి

A Mother Throws 6 Years Son Crocodile Infested River: వాళ్లిద్దరు భార్యభర్తలు.. ఆ దంపతులను వారిని చూసి చుట్టుపక్కల వాళ్లు ముచ్చట్లు పెట్టుకునేవాళ్లు. తమకు అలాంటి అల్లుడు-కూతురు ఉంటే బాగుండేదని అనుకునేవారు. రోజులు గడిచాయి… ఈ దంపతులకు ఓ బాబు పుట్టాడు. నాలుగేళ్లు వచ్చినా బాబుకి మాటలు రాకపోవడంతో డాక్టరు వద్దకు వెళ్లారు ఆ దంపతులు. ఆ డాక్టర్ అసలు విషయం చెప్పేశారు. పుట్టికతో బాబు మూగవాడని చెప్పడంతో పేరెంట్స్ షాకయ్యారు.


కొద్దిరోజుల తర్వాత భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరిగేవి. క్షణికావేశంలో కన్న తల్లి ఆరేళ్ల కొడుకుని మొసళ్లు ఉండే నదిలోకి విసిరేసింది. ఈ ఘటన ఉత్తర కర్ణాటకలో చోటు చేసుకుంది. అసలేం జరిగింది?  హలమాడి గ్రామానికి చెందిన 27 ఏళ్ల రవికుమార్- ఆమె భార్య సావిత్ర మధ్య చీటికి మాటికీ గొడవలు జరిగేవి. ఆ కోపం కాస్త కొడుకు వరకు వెళ్లేది. శనివారం ఈ దంపతుల మధ్య గొడవ జరిగింది. ఎందుకన్నావ్ .. కొడుకుని పారేయ్ అని కట్టుకున్న భర్త కోపంతో చెప్పాడు. ఒక్క నిమిషం ఆలోచించకుండా వెంటనే మొసళ్లు ఉండే నదిలోకి కొడుకుని విసిరేసింది ఆ ఇల్లాలు.

ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. జరిగిన ఘటన గురించి పోలీసులకు చెప్పడంతో బాలుడి కోసం సెర్చింగ్ మొదలుపెట్టారు. చివరకు ఆదివారం బాలుడి మృత దేహాన్ని గుర్తించారు. బాలుడి చేయి మొసలి తినేసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనికి కారణమైన పేరెంట్స్‌ని అరెస్టు చేసి విచారణ మొదలుపెట్టారు పోలీసులు. క్షణికావేశంలో చిన్నారిని పొట్టనపెట్టుకున్నారు ఆ తల్లిదండ్రులు. వీళ్లు మనుషులేనా అంటూ ఆ ఊళ్లో వాళ్లు ఆడిపోసుకుంటున్నారు.


Tags

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×