BigTV English

Best Cars with Ventilated Seats in India: వెంటిలేటెడ్ సీట్లు కలిగిన బెస్ట్ 5 కార్లు.. ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదు.. ధర కూడా తక్కువే..!

Best Cars with Ventilated Seats in India: వెంటిలేటెడ్ సీట్లు కలిగిన బెస్ట్ 5 కార్లు.. ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదు.. ధర కూడా తక్కువే..!

Best Cars With Ventilated Seats: సాధారణంగా వేసవి కాలంలో కారులో జర్నీ చేసేవారు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. కూర్చున్న ప్లేస్‌లో చెమటలు ఎక్కిపోవడం.. కూర్చున్న ప్లేస్ వేడిగా అయిపోవడం జరుగుతుంది. దాని కారణంగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు అలా చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారతదేశంలో వెంటిలేటెడ్ సీట్లను కలిగి ఉన్న అనేక సరసమైన కార్లు అందుబాటులో ఉన్నాయి. ఆ వెంటిలేటెడ్ సీట్లు డ్రైవింగ్ చేసేటప్పుడు మరింత సరదాగా చేస్తాయి. అయితే అలాంటి సీట్లు కలిగిన కార్ ధరలు కూడా చాలా తక్కువ గానే ఉన్నాయి. అందులో 5 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


Tata Nexon

టాటా నెక్సాన్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇది రూ. 11.74 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. అయితే ఈ ధరలో వెంటిలేటెడ్ సీట్లను అందించే అత్యంత సరసమైన కారు టాటా నెక్సాన్ మాత్రమే. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో పాటు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లలో అందుబాటులో ఉంది.


Kia Sonet

కియా సోనెట్ కార్ HTX 1.0L T-GDi 7DCT వేరియంట్‌తో అందుబాటులో ఉంది. ఇది ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లతో అమర్చబడి ఉంది. దీనిద్వారా డ్రైవర్, ముందు ప్రయాణీకులకు సౌకర్యంగా ఉంటుంది. ఇది రూ. 12.09 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. కాగా సోనెట్ ఈ జాబితాలో వెంటిలేటెడ్ సీట్లను అందించే రెండవ కారు. ఈ కాంపాక్ట్ SUV HTX+ ట్రిమ్‌లో రెండు ఇంజన్ ఎంపికలతో లభిస్తుంది. అనేక ట్రాన్స్మిషన్ ఎంపికలు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో లగ్జరీ కోసం చూస్తున్న వారికి ఈ కారు సరసమైన ఎంపిక.

Also Read:  అదరగొట్టే లుక్స్‌తో మహీంద్రా SUV XUV 3XO .. బుకింగ్స్ షురూ!

Maruti Suzuki XL6

మారుతి సుజుకి XL6 కార్ రూ. 12.89 లక్షల ప్రారంభ ధరతో (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంది. ఈ కొత్త మారుతీ కారు కూడా ఈ జాబితాలో చేర్చబడింది. ఇది ఆల్ఫా+ ట్రిమ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు పొందుతుంది. ఈ సీట్లు సుదీర్ఘ ప్రయాణాలకు గొప్ప అనుభూతిని అందిస్తాయి. ఈ మోడల్‌లో కొత్త 6-స్పీడ్ AT గేర్‌బాక్స్, మాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపిక కూడా అందుబాటులో ఉంది.

Hyundai Verna

హ్యుందాయ్ వెర్నా దాదాపు రూ.14.69 లక్షల ప్రారంభ ధరతో (ఎక్స్-షోరూమ్) లభిస్తుంది. ఈ హ్యుందాయ్ వెర్నా ఈ జాబితాలోని అత్యుత్తమ కార్లలో ఒకటి. కంఫర్ట్‌ను ఇష్టపడితే హ్యుందాయ్ వెర్నా మంచి ఎంపిక అని చెప్పొచ్చు. 1.5 లీటర్ MPi పెట్రోల్ 6MT SX(O) వేరియంట్‌లో ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు ఇందులో ఉన్నాయి. ఈ సీట్లు డ్రైవింగ్‌ను సౌకర్యవంతంగా చేస్తాయి. కారు కూడా స్టైలిష్‌గా కనిపిస్తుంది.

Volkswagen Virtus

Volkswagen Virtusలో 1.0 లీటర్ TSI MT టాప్‌లైన్ వేరియంట్‌లో వెంటిలేటెడ్ సీట్లు లభిస్తాయి. ఈ ప్రత్యేక సీట్లు కారును మరింత సౌకర్యవంతంగా, విలాసవంతమైన కారును నడుపుతున్న అనుభూతిని కలిగిస్తాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 15.27 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

Tags

Related News

Amazon-Walmart: టారిఫ్ సెగ.. అమెజాన్-వాల్‌మార్ట్‌ని తాకింది, ఎగుమతులు ఆపాలని డిసైడ్?

Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Boycott US Products: బాయ్ కాట్ అమెరికన్ ఫుడ్స్.. మనం తినే ఈ ఫుడ్ బ్రాండ్స్ అన్ని ఆ దేశానివే!

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

BSNL Rs 1 Plan: వావ్ సూపర్.. రూ.1కే 30 రోజుల డేటా, కాల్స్.. BSNL ‘ఫ్రీడమ్ ఆఫర్’

Wholesale vs Retail: హోల్‌సేల్ vs రిటైల్ మార్కెట్.. ఏది బెటర్? ఎక్కడ కొనాలి?

Big Stories

×