BigTV English

MCD : ఢిల్లీలో కాషాయ కోట బద్దలు.. ఆప్ ఘన విజయం..

MCD : ఢిల్లీలో కాషాయ కోట బద్దలు.. ఆప్ ఘన విజయం..

MCD : ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో ఆప్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 15 ఏళ్ల బీజేపీ పాలనను చరమగీతం పాడింది. మొత్తం 250 వార్డుల్లో 130 ఆప్ కైవసం చేసుంది. దీంతో మేయర్‌ సీటు ఆమ్ ఆద్మీ వశమైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 97 వార్డులను దక్కించుకుంది. బీజేపీ ఢిల్లీ చీఫ్‌ ఆదేశ్ గుప్తా నియోజకవర్గం పటేల్‌ నగర్‌లోని నాలుగు వార్డుల్లోనూ కాషాయ పార్టీ ఓటమిపాలైది. ఇక కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా చతికిలపడింది. హస్తం పార్టీ కేవలం7 స్థానాలకు పరిమితమైంది. మరో నాలుగు చోట్ల ఇతరులు విజయం సాధించారు.


1958లో ఏర్పాటైన ఎంసీడీ ని 2012లో నాటి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ హయాంలో మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేశారు. తిరిగి వాటిని ఈ ఏడాది విలీనం చేసి ఎంసీడీగా పునరుద్ధరించారు. మే 22 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో దశాబ్దంన్నర పాటు భాజపానే అధికారంలో ఉంది. 2017 మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ 181 స్థానాల్లో గెలుపొందింది. అప్పుడు ఆప్‌ 48, కాంగ్రెస్‌ 27 వార్డులను కైవసం చేసుకున్నాయి.

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్న వేళ.. ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు ఆప్‌ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. పార్టీ కార్యాలయం వద్ద ఆప్‌ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.


పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌...

ఢిల్లీ అసెంబ్లీలో 15 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనను అరవింద్‌ కేజ్రీవాల్‌ పెకిలించారు. ఇప్పుడు ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 15 ఏళ్లపాటు అధికారంలో ఉన్న బీజేపీ కూడా గద్దెదించారు. విద్వేష రాజకీయాలను ఢిల్లీ ప్రజలు ఇష్టపడటం లేదని రుజువైంది. స్కూళ్లు, ఆసుపత్రులు, విద్యుత్‌, పరిశుభ్రతకే వారు ఓటేశారు .

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×