PM Shram Yogi Maan Dhan scheme: ప్రతీ నెలా 55 రూపాయలు చెల్లిస్తే చాలు.. కొద్దిరోజుల తర్వాత నెలకు మూడు వేలు అందుకోవచ్చు. నమ్మడానికి విచిత్రంగా ఉన్నా ముమ్మాటికీ నిజం. కేంద్రంలోని మోదీ సర్కార్ వచ్చిన తర్వాత మధ్య, దిగువ వర్గాలవారికి రకరకాల పథకాలు ప్రవేశపెట్టారు. ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికుల కోసం తీసుకొచ్చిన పథకం ఇది. వృద్ధాప్యంలో ఆదాయ భద్రతను కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వహిస్తోంది. వయస్సు బట్టి ప్రతీ నెలకు 55 రూపాయల నుంచి 200 వరకు చెల్లిస్తే సరిపోతుంది. ఆ తర్వాత ప్రతీనెల పెన్షన్ కింద 3 వేలు అందుకోవచ్చు.
ప్రధాన్‌మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన స్కీమ్
అన్నివర్గాల ప్రజలకు అందుబాటులోకి పలు పథకాలు తెచ్చింది కేంద్రప్రభుత్వం. అందులో ప్రధాన్‌మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన ఉంది. ఈ పథకంలో చేరినవారు ప్రతి నెలా 3 వేల చొప్పున పెన్షన్ అందుకోవచ్చు. పీఎం శ్రమ్ యోగి మాన్ ధన్ స్కీమ్‌లో చేరాలనుకునేవారు ఓ విషయం తెలుసుకోవాలి. 18 నుంచి 40 ఏళ్ల వయస్సువారికి మాత్రమే. వారి నెలవారీ ఆదాయం 15 వేలలోపు ఉండాలి.
అసంఘటిత రంగంలో పనిచేసేవారు అర్హులు. EPF, ESIC, NPS వంటి పథకాల్లో సభ్యులుగా ఉండరాదు. అలాగే ఆదాయ పన్ను చెల్లించరాదన్నది నిబంధనలు ఉన్నాయి. 18 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వయస్సు వారు నెలకు 55 రూపాయలు చెల్లించాలి. అదే 30 నుంచి 39 ఏళ్ల మధ్యవారు నెలకు 100 రూపాయలు చెల్లించాలి. 40 ఏళ్ల వారు ప్రతీ నెలా 200 రూపాయలు చెల్లించాలి.
నిబంధనలు ఏంటి? ఎవరికి ప్రయోజనం
60 ఏళ్ల తర్వాత వారికి ప్రతీ నెలా 3 వేల రూపాయలు పెన్షన్ వస్తుంది. ఒకవేళ ఇంటి యజమాని మరణిస్తే భార్యకు 50 శాతం పెన్షన్ వస్తుంది. ఒకవేళ ఇంటి సభ్యుడు 60 ఏళ్లు నిండకముందే మరణిస్తే భార్య ఆ పథకాన్ని కొనసాగించవచ్చు. లేకుంటే ఉపసంహరించుకోవచ్చు. దీనికి ప్రభుత్వం-వినియోగదారుడు 50-50 నిష్పత్తిలో చెల్లిస్తారు.
ఒకవేళ ఈ స్కీమ్ నుంచి బయటకురావాలని భావిస్తే 10 ఏళ్లకు ముందు ఉపసంహరించుకుంటే మీరు చెల్లించిన మొత్తంతోపాటు బ్యాంకు వడ్డీ రేటు కలిపి ఆ మొత్తం తీసుకోవచ్చు. 10 ఏళ్ల తర్వాత కానీ, 60 ఏళ్లు నిండకముందు ఉపసంహరించుకుంటే చెల్లించిన మొత్తంతోపాటు వడ్డీ కూడా లభిస్తుంది.
ALSO READ: ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్య కేసు.. మరో పోలీసు అధికారి సూసైడ్
ఈ పథకానికి అవసరమైన డాక్యుమెంట్లు లేదా పత్రాలు ఇవన్నీ ఉండాలి. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ లేదా జన్‌ధన్ ఖాతా (ఐఎఫ్‌ఎస్సీ) కోడ్ ఉండాలి. అలాగే మొబైల్ నెంబర్ కచ్చితంగా ఉండాలి. దీనికితోపాటు ఇన్ కం సర్టిఫికెట్ తప్పనిసరి. అసంఘటిత రంగానికి చెందినవారికి మాత్రమే. కేవలం 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో వయసు వారే.
నెలకు 15 వేల వరకు ఆదాయం పొందే వారు అర్హులు. ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన పథకంలో చేరాలని భావించేవారు దగ్గనలో కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లాలి. మాన్ ధన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆధార్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటే చాలు.