Bangalore News: మౌలిక సదుపాయాలను విమర్శిస్తూ ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రియాక్ట్ అయ్యారు. మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, స్టార్టప్‌లు-ఆవిష్కరణల పరంగా బెంగళూరుకు సాటిలేని నగరం దేశంలో మరొకటి లేదని తేల్చేశారు.
ఏపీలో గూగుల్ పెట్టుబడుల వ్యవహారం
బుధవారం బెంగుళూరులోని విధానసౌధలో మీడియాతో మాట్లాడారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఈ సందర్బంగా మీడియా పలు ప్రశ్నలు లేవనెత్తింది. నారా లోకేష్ అయినా మరెవరైనా చేసిన వ్యాఖ్యలు చేసినా స్పందించనని అన్నారు. ఒకటి చెబుతున్నానని, బెంగళూరుతో పోటీపడే నగరం దేశంలో మరొకటి లేదని తేల్చేశారు.
బెంగళూరులో 25 లక్షల మంది ఐటీ నిపుణులు, 2 లక్షల మంది విదేశీయులు నిపుణలు పని చేస్తున్నారని చెప్పారు. కేంద్రానికి వచ్చే ఆదాయంలో దాదాపు 40 శాతం కర్ణాటక నుంచి వస్తుందన్నారు. వారు తమను తాము మార్కెట్ చేసుకోవడానికి బెంగుళూరు గురించి మాట్లాడుకుంటారని చురక అంటించారు. వారు ఏదైనా చేయనివ్వండి.. కేంద్రం వారికి సహాయం చేయనివ్వండని అన్నారు.
నారా లోకేష్ వర్సెస్ డీకే శివకుమార్
బెంగుళూరుతో పోలిక అనవసరమన్నారు. గూగుల్.. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లడం గురించి అడిగినప్పుడు అక్కడి ప్రభుత్వం చాలా రాయితీలు ఇస్తున్నందున ఆ కంపెనీ అక్కడికి వెళ్తోందన్నారు. ఏపీకి వెళ్లేవారికి మనం నో చెప్పగలమా? వారు కూడా ప్రతి చోటా చూసి అనుభవాలు తెలుసుకోవాలన్నారు.
బెంగళూరుని ఎవరూ వదిలి వెళ్ళరని ఒక్కమాటలో తేల్చేశారు. తాము మినహాయింపులు ఇస్తామని ప్రకటించి ఎవరినీ పిలవాల్సిన అవసరం లేదన్నారు. బెంగళూరులోని అన్ని సౌకర్యాలు పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయని మనసులోని మాట బయట పెట్టారు. కర్ణాటకకు, బెంగుళూరు నగరానికి మరిన్ని విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని శివకుమార్ అన్నారు.
ALSO READ: కోర్టు ప్రొసీడింగ్స్.. మహిళను ముద్దు పెట్టిన లాయర్
ఎంతమంది విదేశీ కంపెనీలు తమను సంప్రదిస్తున్నారో మాకు తెలుసన్నారు. తాను ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే, భారీ పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ ఎదురుగా కూర్చుని చర్చించినట్టు చెప్పుకొచ్చారు. విదేశీ కంపెనీలు చాలా కాలంగా బెంగళూరులో అద్దెకు ఉంటున్నాయని, ఇప్పుడు సొంతంగా స్థలాన్ని కొనుగోలు చేయడానికి సాగుతున్నట్లు చెప్పారు. సొంతంగా క్యాంపస్‌ను కలిగి ఉండటానికి ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
ఇంతకీ ఏపీ మంత్రి నారా లోకేష్ ఏమన్నారు? గూగుల్‌తో ఒప్పందానికి రీసెంట్‌గా ఢిల్లీ వెళ్లారు మంత్రి లోకేష్. ఆ సమయంలో ఓ మీడియా హౌస్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. పెట్టుబడుల విషయమై మాట్లాడిన లోకేష్, బెంగుళూరు నుంచి అనంతపురం వైపుకు అర్థం వచ్చేలా మాట్లాడారు. ఈ నేపథ్యంలో డీకే రియాక్ట్ అయినట్టు అక్కడి కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు గురువారం ఉదయం మంత్రి లోకేష్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. విశాఖలో గూగుల్ పెట్టుబడులపై ఎక్స్‌లో ఈ విధంగా రాసుకొచ్చారు. ఆంధ్రా వంటకాలు ఘాటు ఎక్కువని అంటారు.. మన పెట్టుబడులు కూడా అంతేనేమో. దాని ప్రభావం తాలూకు ఘాటు కొంతమందికి ఇప్పటికే తగులుతోందని రాసుకొచ్చారు.
They say Andhra food is spicy. Seems some of our investments are too. Some neighbours are already feeling the burn! 🌶️🔥 #AndhraRising #YoungestStateHighestInvestment
— Lokesh Nara (@naralokesh) October 16, 2025