E-Paper
Advertisement

అర్ధరాత్రి అనుభవం.. క్యాబ్‌లో ఒంటరి ప్రయాణం, ముంబై యువతి ఇన్‌స్టా పోస్ట్

అర్ధరాత్రి అనుభవం.. క్యాబ్‌లో ఒంటరి ప్రయాణం, ముంబై యువతి ఇన్‌స్టా పోస్ట్
Advertisement

Mumbai: ఈ మధ్యాకాలం వేర్వేరు ఘటనలు జరుగుతున్న వేళ అర్ధరాత్రి క్యాబ్‌లో మహిళలు ఒంటరిగా ప్రయాణం చేయడం కష్టంగా ఉంటుందని చాలా మంది చెబుతుంటారు. ముంబై సిటీలో అర్ధరాత్రి వేళ క్యాబ్‌లో ప్రయాణించిన ఓ యువతి, ఇవాళ మగాడిలా అనిపించిందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది.

ముంబై యువతి ఇన్‌స్టా పోస్ట్

అపూర్వ అనే యువతి ముంబైలో అర్ధరాత్రి దిగింది. మహిళ నడుపుతున్న క్యాబ్‌ను బుక్ చేసుకుంది. సిటీలో మహిళ పట్ల భయాలను ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రయాణం చేయడం ఎలా ఉంటుందో అనుభవించింది. ఆ అనుభూతిని వర్ణించింది. ఈ రోజు ఒక మగాడిలా అనిపించిందంటూ వచ్చిన ఆలోచనను షేర్ చేసుకుంది. ఆమె చేసిన పోస్టు వైరల్ అవుతోంది. మహిళా క్యాబ్‌లో ప్రయాణించడం మరచిపోలేని అనుభూతిగా చెప్పుకొచ్చింది.

అర్ధరాత్రి అనుభవం.. క్యాబ్‌లో ఒంటరి ప్రయాణం

Advertisement

ఆ సమయంలో తనకు కలిగిన స్వేచ్ఛ ప్రస్తావించింది. తన ప్రయాణంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా సాగిందని వివరించింది. దీన్ని గొప్ప విషయంగా రాసుకొచ్చింది. నా భద్రత గురించి ఆందోళన చెందాలనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయాను,  అని  ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. రాత్రివేళ ప్రయాణం చేసినప్పుడు ఫోన్ చెక్ చేస్తూ ఉంటానని, అలాగే కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్టు నటించడం వంటివి చేస్తానని వివరించింది. ఈసారి అలాంటి అవసరం లేకుండా పోయిందని పేర్కొంది. చాలా హ్యాపీగా అర్ధరాత్రి ప్రయాణం జరిగిందంటూ  మనసులోని మాట బయటపెట్టింది.

ALSO READ: భర్తను వదిలి మరో వ్యక్తితో 10 ఏళ్లు సహజీవనం చేసిన భార్య.. భరణం కేసులో కోర్టు తీర్పు ఇదే

Advertisement

కొన్నిసార్లు భయం లేకుండా జీవించడమే స్వేచ్ఛ అని పేర్కొంది అపూర్వ. ఇలాంటివి అందరూ పొందలేని, అలాగని పురుషులకు ఎలాంటి భయాలు ఉండవని అర్థం కాదని చెప్పుకొచ్చింది అపూర్వ. భద్రత గురించి ఆలోచించకుండా తిరగితే ఎలా ఉంటుందని చెప్పడానికి స్మాల్ ఎగ్జాంఫుల్‌ అని ప్రస్తావించింది.  యువతి వీడియో నేపథ్యంలో రాత్రి వేళ ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు తీసుకునే జాగ్రత్తల గురించి ఆన్‌లైన్‌లో అప్పుడే చర్చ మొదలైంది.

:

 

?utm_source=ig_embed&ig_rid=AzjJ_BJMJcqQE7CGHWc1h4e

 

Related News

17 మంది ఖైదీల పరారీ ఘటన.. వెలుగులోకి షాకింగ్ నిజాలు.. ఆ రోజు జైల్లో ఏం జరిగిందంటే?

భర్తను వదిలి మరో వ్యక్తితో 10 ఏళ్లు సహజీవనం చేసిన భార్య.. భరణం కేసులో కోర్టు తీర్పు ఇదే

ఆరేళ్ల బాలుడికి జాక్‌పాట్.. ఏకంగా రూ.50 లక్షల కారు, అదెలా సాధ్యం?

భారతీయ పైలట్‌కు యూఏఈ అత్యున్నత అవార్డుతో సత్కారం.. ఎందుకో తెలుసా..?

టాటా గ్రూప్‌ను నాశనం చేస్తున్నారు.. ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ ఫైర్!

బ్యాలెట్ పేపర్లలోనూ కాంగ్రెస్‌కు సున్నా.. ప్రధాని మోదీ సంచలన కౌంటర్!

సినిమా స్టయిల్‌లో ప్రియుడితో కలిసి భర్తను లేపేందుకు స్కెచ్.. కీలక అంశాలు వెలుగులోకి

Big Stories

Advertisement
×