Toyota car Jack pot: మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లోని సీలంపురాకు చెందిన ఆరేళ్ల బాలుడికి పేరు మేధాంశ్ రైక్వార్. బాలుడి బామ్మ కిరణ్ ఏడాది కిందట ఆభాపురిలో జరిగిన గర్బా వేడుకలకు హాజరయ్యారు. వేడుకలు అంటే చెప్పాల్సిన పని లేదు. రకరకాల బంపర్ డ్రాలు ఉంటాయి. సరిగ్గా బాలుడి బామ్మ అదే చేసింది. కేవలం రూ.200 లతో లక్కీ డ్రా కూపన్ మనవడి పేరిట కొనుగోలు చేసింది. 2026లో లక్కీ డ్రా ఫలితాలు వెలువడ్డాయి. మేదాంశ్ ఎంపిక కావడంతో ఆనందంతో ఉప్పొంగిపోయింది ఆ కుటుంబం. సుమారు రూ.50 లక్షల విలువైన ఫార్చ్యూనర్ కారు అది.
వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ విజయం పరిసర ప్రాంతాల్లో ఉత్సాహాన్ని నింపింది. చిన్నారి ఫ్యామిలీ ఏర్పాటు చేసిన సంబరాల్లో ఇరుగు పొరుగు పాల్గొన్నారు. డప్పుల మోత మధ్య ప్రజలు మేధాంశ్‌కు ఘన స్వాగతం పలికారు. కారు అందుకున్న మేధాంశ్ కుటుంబ సభ్యులు నేరుగా దేవాలయానికి తీసుకెళ్లి పూజలు చేయించారు.
విచిత్రం ఏంటంటే రెండేళ్లుగా సొంత కారు కొనుక్కోవాలని మేధాంశ్ కుటుంబం ఆశపడుతోంది. అనుకోకుండా లక్కీ డ్రాలో కారు గెలుచుకోవడంతో ఆ కల ఎట్టకేలకు నెరవేరింది. కారు ఇచ్చిన వచ్చిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రూ. 200 లక్కీ కూపన్‌తో బహుమతి లభించడంతో వినియోగదారులు ఆశ్చర్యపోయారు. చాలామంది వారికి అభినందన సందేశాలు పంపారు.
టయోటా ఫార్చ్యూనర్ కారు 7 సీటర్ SUV. వాహనం నిర్మాణం, రోడ్డుపై వెళ్లే తీరు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. హిలక్స్‌తో పంచుకున్న లాడర్-ఫ్రేమ్ ఛాసిస్‌పై నిర్మించబడింది. 4×4 అధిక గ్రౌండ్ క్లియరెన్స్ ఆ వాహనం సొంతం. రకరకాల డ్రైవ్ మోడ్‌లతో బలమైన ఆఫ్-రోడ్ సామర్థ్యాన్ని కలిగివుంది. లెదర్ సీట్లు కలిగివున్న టయోటా కారులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఉంది.
ALSO READ: భారతీయ పైలట్‌కు యూఏఈ అత్యున్నత అవార్డుతో సత్కారం.. ఎందుకో తెలుసా..?
ఇక వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 360-డిగ్రీ కెమెరా, సేఫ్టీ సెన్స్ ఫీచర్స్ ఉన్నాయి. ఆ కారు.. పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌తో పని చేస్తుంది. మాన్యువల్, ఆటోమేటిక్ రెండు ఆప్షన్‌లు ఉన్నాయి.