E-Paper
Advertisement

17 మంది ఖైదీల పరారీ ఘటన.. వెలుగులోకి షాకింగ్ నిజాలు.. ఆ రోజు జైల్లో ఏం జరిగిందంటే?

17 మంది ఖైదీల పరారీ ఘటన.. వెలుగులోకి షాకింగ్ నిజాలు.. ఆ రోజు జైల్లో ఏం జరిగిందంటే?
Advertisement

Theni Jail Escape: తమిళనాడులోని తేని జిల్లా సబ్‌జైలులో ఇటీవల జరిగిన ఖైదీల పరారీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటనకు సంబంధించి తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదేదో నెలల తరబడి వేసిన స్కెచ్ కాదని.. కేవలం గంటల వ్యవధిలో వ్యూహం పన్ని 17 మంది ఖైదీలు జైలు నుంచి పారిపోయారని తాజాగా వెల్లడైంది. బెయిల్ రాకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న కొందరు ఖైదీలు.. 3 గంటల వ్యవధిలోనే ప్లాన్ వేసి దాన్ని అమలు చేసినట్లు అధికారుల విచారణలో బయటపడింది.

మెరుపు వేగంతో ‘మాస్టర్ ప్లాన్’

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో ఈ కుట్రకు పునాది పడింది. తాము చేసుకున్న బెయిల్ అభ్యర్థనను ఆ రోజున కోర్టు తిరస్కరించడంతో కొందరి ఖైదీలో అసహనం కట్టలు తెంచుకుంది. దీంతో ఎలాగైనా జైలు నుంచి తప్పించుకొని వారు నిర్ణయించుకున్నారు. ఈ పరారీకి సంబంధించి మదురైకి చెందిన లింగ ప్రసాద్ (26) అనే నిందితుడు మాస్టర్ మైండ్ గా వ్యవహరించినట్లు అధికారుల విచారణలో బయటపడింది. మెడికల్ ఎమర్జెన్సీని ఆసరాగా చేసుకుని సిబ్బందిని దారి మళ్లించాలని అతడు ప్లాన్ చేశాడు.

ఫిట్స్ నాటకం.. జైలు సిబ్బందిపై దాడి!

Advertisement

లింగ ప్రసాత్ ఇచ్చిన సలహాతో ముత్తు ఇళంగోవన్ (26) అనే ఖైదీ రాత్రి 10 గంటల సమయంలో తనకు ఫిట్స్ (మూర్ఛ వ్యాధి) వచ్చినట్లు నాటకం మెుదలుపెట్టాడు. అతడి పరిస్థితి చూసి మిగతా ఖైదీలు పెద్ద ఎత్తున కేకలు వేస్తూ గందరగోళం సృష్టించారు. ఖైదీని కాపాడేందుకు జైలు సిబ్బంది బ్యారెక్ లోపలికి రాగానే.. అప్పటికే సిద్దంగా ఉంచుకున్న కిచెన్ వస్తువులతో ఒక్కసారిగా వారిపై ఖైదీలు దాడికి తెగబడ్డారు. ఆ తర్వాత మెయిన్ గేటు వద్ద ఉన్న సిబ్బందిని బెదిరించి తాళాలు లాక్కుకున్నారు. అలా మొత్తం 17 మంది ఖైదీలు ఎంతో చాకచక్యంగా జైలు నుంచి పరారయ్యారు.

Also Read: BSNL చౌకైన ప్లాన్లు.. రోజుకు రూ.5, రూ.6 మాత్రమే.. 330 రోజుల వ్యాలిడిటీతో ఫ్రీ కాల్స్, డేటా!

48 గంటల్లోనే ఖైదీలు అరెస్టు

Advertisement

అయితే పరారైన 17 మంది ఖైదీలను పోలీసులు 48 గంటల వ్యవధిలోనే తిరిగి అదుపులోకి తీసుకున్నట్లు దక్షిణ మండల ఐజీ విజయేంద్ర బిదరి తెలిపారు. పరారీ జరిగిన బ్లాక్‌లో మొత్తం 32 మంది విచారణ ఖైదీలు ఉండగా అందులో 17 మంది పారిపోయారని స్పష్టం చేశారు. మిగిలిన ఖైదీలు కూడా ఈ ప్లాన్‌కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సాయం చేశారా? అన్న కోణంలో విచారిస్తున్నట్లు ఐజీ తెలిపారు. జైలులోని భద్రతా లోపాలను ఆసరాగా చేసుకుని వీరు ఏ విధంగా పారిపోయారన్న దానిపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతున్నట్లు వివరించారు.

Also Read: రూ. 15,000 లోపే బెస్ట్ మినీ ఫ్రిజ్‌లు.. హాస్టలర్స్, బ్యాచిలర్స్‌కి సూపర్ ఛాయిస్!

Tags

Related News

సూపర్ ఎల్ నినో ఎఫెక్ట్.. మార్చి నాటికి భారత్‌లో 55 వేల మరణాలు.. కలవరపెడుతున్న గణాంకాలు!

అర్ధరాత్రి అనుభవం.. క్యాబ్‌లో ఒంటరి ప్రయాణం, ముంబై యువతి ఇన్‌స్టా పోస్ట్

భర్తను వదిలి మరో వ్యక్తితో 10 ఏళ్లు సహజీవనం చేసిన భార్య.. భరణం కేసులో కోర్టు తీర్పు ఇదే

ఆరేళ్ల బాలుడికి జాక్‌పాట్.. ఏకంగా రూ.50 లక్షల కారు, అదెలా సాధ్యం?

భారతీయ పైలట్‌కు యూఏఈ అత్యున్నత అవార్డుతో సత్కారం.. ఎందుకో తెలుసా..?

టాటా గ్రూప్‌ను నాశనం చేస్తున్నారు.. ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ ఫైర్!

బ్యాలెట్ పేపర్లలోనూ కాంగ్రెస్‌కు సున్నా.. ప్రధాని మోదీ సంచలన కౌంటర్!

Big Stories

Advertisement
×