E-Paper
Advertisement

సినిమా స్టయిల్‌లో ప్రియుడితో కలిసి భర్తను లేపేందుకు స్కెచ్.. కీలక అంశాలు వెలుగులోకి

సినిమా స్టయిల్‌లో ప్రియుడితో కలిసి భర్తను లేపేందుకు స్కెచ్.. కీలక అంశాలు వెలుగులోకి
Advertisement

Ghaziabad: పచ్చని సంసారంలో అక్రమ సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. ఫలితంగా హత్యలకు ప్లాన్ చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి ఘజియాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బాధిత భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.  అసలు తెర వెనుక ఏం జరిగింది?

ఘజియాబాద్‌లో దారుణమైన ఘటన

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వసుంధర సెక్టార్ 1లోని జగృతి RWA సొసైటీలో శశాంక్ కంతారియా-ప్రియా శర్మకు నివాసం ఉంటున్నారు. వారికి పిల్లలు ఉన్నారు. శశాంక్.. ఢిల్లీ ప్రభుత్వంలో సీనియర్ అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. హాయిగా సాగుతున్న సంసారంలోకి కొత్త కోరికలు ఎంట్రీ ఇచ్చాయి. ఈ క్రమంలో శశాంక్ భార్య ప్రియా శర్మ జిమ్‌కు వెల్లడం మొదలైంది. అక్కడ ట్రైనర్ ప్రతాప్‌సింగ్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది.

ప్రియుడితో కలిసి భర్తను లేపేందుకు భార్య స్కెచ్

Advertisement

ఈ క్రమంలో ఇద్దరు ఒకటి కావాలని, వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అయితే భార్య ప్రియ వ్యవహారం శశాంక్ తెలియడంతో మరొక ఫ్లాట్ కు మారాలని డిసైడ్ అయ్యాడు. దీపావళి తర్వాత ఇల్లు మారే ప్రణాళికను అమలు చేయాలనుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య, తన భర్తను వదిలించుకోవాలని డిసైడ్ అయ్యింది. అందుకు జిమ్ ప్రియుడితో కలిసి హత్యకు ప్లాన్ చేసింది. ఈ పథకంలో భాగంగా ప్రియా ఇంటి తలుపులు వేయకుండా ఓపెన్ చేసింది.

ఈలోగా జిమ్ ప్రియుడు ప్రతాప్ సింగ్ అక్టోబర్ 26న తెల్లవారుజామున 5.15 గంటలకు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. భర్త శశాంక్‌పై కత్తితో దాడి చేశారు. కత్తితో శశాంకను పలుమార్లు పొడిచారు.  అదే సమయంలో కూతురు ఏడుస్తూ కనిపించింది. తీవ్రంగా గాయపడిన శశాంక్.. గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుండి ఎస్కేప్ అయ్యాడు. ఇంటి నుంచి పారిపోయిన తర్వాత సింగ్‌ను అదే సొసైటీ నివాసి గమనించాడు. అతడి చేతులపై రక్తాన్ని చూసి పట్టుకోవడానికి ప్రయత్నించాడు.

Advertisement

ALSO READ: టాటా గ్రూపును నాశనం చేశారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యల వెనుక

సదరు వ్యక్తిని ట్రైనర్ పక్కకు తోసేసి, సెక్యూరిటీ గార్డులను తప్పించుకుని పరుగెత్తాడు. గార్డులు అతడిని మోటార్ సైకిల్‌పై వెంబడించి, పట్టుకున్నారు. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన శశాంక్‌ను అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. శశాంక్ సోదరుడి ఫిర్యాదు చేయడంతో ఇందిరాపురం పోలీసులు.. ప్రియ శర్మ, ఆమె ప్రియుడ్ని అరెస్టు చేశారు. వారిపై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కేసు నమోదు చేశారు. దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఎవరి పాత్ర ఎంత అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. శశాంక్-ప్రియకు 2021లో వివాహం జరిగింది. ఈ జంటకు కుమార్తె ఉంది. శశాంక్ తో వివాహానికి ముందు ప్రియకు ఒకసారి వివాహం జరిగిందని పోలీసులు చెప్పుకొచ్చారు.

Related News

ప్రజలకు విజయ్ ప్రభుత్వం బిగ్ షాక్.. ఆటో ఛార్జీలు, పాల ఉత్పత్తుల ధరలు పెంచుతూ నిర్ణయం!

టాటా గ్రూపును నాశనం చేశారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యల వెనుక

అర్నబ్ తుఫాను ప్రభావం.. తమిళనాడు-పుదుచ్చేరిలో భారీ వర్షాలు

డిజిటల్ అరెస్టుల వ్యవహారం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు, ఉక్కుపాదం మోపాలని ఆదేశం

జడ్జి కొడుకు యాక్సిడెంట్ కేసులో బిగ్ ట్విస్ట్.. కొచ్చి పోలీస్ కమిషనర్‌పై వేటు.. కారణం ఏంటంటే?

అల్లుడు ఎంత పని చేశాడు.. అత్తింట్లోనే పదే పదే దాడులు, వెలుగులోకి సీసీటీవీ ఫుటేజ్

డొనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్.. ఇండియన్ అమెరికన్ సర్వేలో షాకింగ్ ఫ్యాక్ట్స్?

Big Stories

Advertisement
×