Tata Sons: భారత చరిత్రలోనే అత్యంత విశ్వసనీయమైన పారిశ్రామిక సామ్రాజ్యంగా పేరున్న టాటా గ్రూప్ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎన్.చంద్రశేఖరన్ రీ-అపాయింట్‌మెంట్ వివాదం ముసలం పుట్టించగా, ఈ పరిణామాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. టాటా గ్రూప్‌ను నేరపూరితంగా నాశనం చేస్తున్నారని.. సంచలన ఆరోపణలు చేశారు.
ఈ పరిణామాలపై దేశంలోని ఏ వ్యాపారవేత్త కూడా నోరు విప్పడానికి ధైర్యం చేయడం లేదని విమర్శించారు. వ్యాపారవేత్తలు ఇంకెంత కాలం మౌనంగా ఉంటారని ప్రశ్నించారు. మిమ్మల్ని పూర్తిగా వారు స్వాధీనంలోకి తీసుకునే వరకు వేచి చూస్తారా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. భారతీయ వ్యాపార రంగం మోడీ, అమిత్ షాల ఆటబొమ్మ కాదన్నారు రాహుల్. మీలో ధైర్యం లేకపోవచ్చు, మాకు ఉంది, ఈ నేరాలకు కచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామంటూ.. కేంద్ర ప్రభుత్వాన్ని డైరెక్ట్‌గా టార్గెట్ చేశారు.
మరోవైపు, టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్‌కు, దానిలో కీలక వాటా కలిగిన టాటా ట్రస్ట్స్‌కు మధ్య బోర్డు మీటింగ్స్ అండ్ ప్రొసీజర్స్‌పై తీవ్ర విభేదాలు నడుస్తున్నాయి. ఎన్.చంద్రశేఖరన్‌ను టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా మరో ఐదేళ్లపాటు నియమించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని.. టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా వ్యతిరేకించారు. ఆయన నియామక విధానంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బోర్డు నిర్ణయాలు కార్పొరేట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఆరోపణలపై అటు బీజేపీ నుంచి గానీ, ఇటు టాటా గ్రూప్ నుంచి గానీ అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు.
ఒకవైపు కార్పొరేట్ దిగ్గజాల అంతర్గత పోరు.. మరోవైపు దేశ రాజకీయాల్లో దీనిపై జరుగుతున్న తీవ్ర దుమారం, టాటా సంస్థ భవిష్యత్తును ఏ మలుపు తిప్పుతాయన్న దానిపై అంతటా ఉత్కంఠ నెలకొంది. ఈ హైవోల్టేజ్ కార్పొరేట్-పొలిటికల్ రగడపై ఎక్కడికి దారితీస్తుందనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.
Also read: అయ్యప్ప భక్తులకు బిగ్ అప్‌డేట్.. శబరిమల యాత్రకు వర్చువల్ బుకింగ్స్ స్టార్ట్!