E-Paper
Advertisement

బ్యాలెట్ పేపర్లలోనూ కాంగ్రెస్‌కు సున్నా.. ప్రధాని మోదీ సంచలన కౌంటర్!

బ్యాలెట్ పేపర్లలోనూ కాంగ్రెస్‌కు సున్నా.. ప్రధాని మోదీ సంచలన కౌంటర్!
Advertisement

PM Modi: దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం పాలవ్వడంపై ప్రధాని నరేంద్ర మోదీ సెటైర్లు వేశారు. ఈ ఓటమితో ప్రతిపక్ష పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలిందని అర్ధం వచ్చేలా ఎక్స్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బ్యాలెట్‌ పత్రాలతో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయని గుర్తుచేస్తూ.. కాంగ్రెస్‌ ఎన్ని స్థానాలు గెలిచిందో ఊహించాలంటూ పోస్టు చేశారు. దీనికి ‘మోనోకిల్‌’ ఎమోజీని జతచేశారు.

కాంగ్రెస్ ఘోర ఓటమి

యూపీ, మహారాష్ట్ర, బిహార్, కర్ణాటక రాష్ట్రాల్లో మెుత్తం 28 శాసనమండలి స్థానాలకు ఇటీవల ఉపఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన 12 స్థానాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది. గతంలో తాము ప్రాతినిధ్యం వహించిన నాలుగు స్థానాలను కూడా నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా తాము అధికారంలో ఉన్న కర్ణాటకలోనే ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం కాంగ్రెస్‌కు అతిపెద్ద పరాభవంగా మారింది.

మోదీ సెటైరికల్ పోస్ట్

Advertisement

అయితే ఎన్నికల సమయంలో ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతోందని, తిరిగి బ్యాలెట్ పేపర్ల విధానాన్నే తీసుకురావాలని కాంగ్రెస్ గత కొంతకాలంగా డిమాండ్ చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ ఫలితాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ల ద్వారానే జరిగాయనే విషయాన్ని గుర్తుచేస్తూ.. ‘ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, కర్ణాటక వంటి 4 పెద్ద రాష్ట్రాల్లో 28 సీట్లకు ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ల ద్వారానే జరిగాయి. మరి కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుచుకుందో ఊహించండి?’ అని మోదీ ఎక్స్‌లో మోనోకిల్ (కంటి అద్దం) ఎమోజీని జతచేస్తూ పోస్ట్ చేశారు.

కాంగ్రెస్‌కు రియాలిటీ చెక్ అవసరం: స్మృతి ఇరానీ

Advertisement

మరోవైపు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతి ఇరానీ కూడా కాంగ్రెస్ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఓటమి ఎదురైనప్పుడల్లా ఈవీఎంలను బోనులో నిలబెట్టి ఓట్ల చోరీ అని ఆరోపణలు చేసేవారికి ప్రజలు బ్యాలెట్ పేపర్ల ద్వారా కూడా తగిన సమాధానం చెప్పారు. నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా గెలవలేని కాంగ్రెస్ నాయకులు ఇకనైనా సాకులు చెప్పడం మానేసి, క్షేత్రస్థాయిలోకి వచ్చి అసలు నిజాలు తెలుసుకోవాలి’ అని విమర్శించారు.

Also Read: ఎల్‌నినో ముప్పుపై ప్రభుత్వం అలర్ట్.. మండల స్థాయిలో సమన్వయ కమిటీల ఏర్పాటు!

బ్యాలెట్ విధానానికే కాంగ్రెస్ పట్టు

అయితే బీజేపీ విమర్శలను కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహించాలనే తమ డిమాండ్‌కే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఇటీవల మాట్లాడూతూ.. దేశవ్యాప్తంగా పౌరులు, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సంఘం పనితీరుపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో మార్పులు, ఈవీఎంలపై తమ ప్రశ్నలకు ఎన్నికల సంఘం సరైన సమాధానం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో మళ్లీ నమ్మకం కలగాలంటే బ్యాలెట్ విధానానికే తిరిగెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు.

Also Read: ‘అర్నబ్’ తుపాను ప్రభావంతో.. జరిగిన నష్టాలపై సీఎం చంద్రబాబు సమీక్ష!

Tags

Related News

టాటా గ్రూప్‌ను నాశనం చేస్తున్నారు.. ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ ఫైర్!

సినిమా స్టయిల్‌లో ప్రియుడితో కలిసి భర్తను లేపేందుకు స్కెచ్.. కీలక అంశాలు వెలుగులోకి

ప్రజలకు విజయ్ ప్రభుత్వం బిగ్ షాక్.. ఆటో ఛార్జీలు, పాల ఉత్పత్తుల ధరలు పెంచుతూ నిర్ణయం!

టాటా గ్రూపును నాశనం చేశారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యల వెనుక

అర్నబ్ తుఫాను ప్రభావం.. తమిళనాడు-పుదుచ్చేరిలో భారీ వర్షాలు

డిజిటల్ అరెస్టుల వ్యవహారం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు, ఉక్కుపాదం మోపాలని ఆదేశం

జడ్జి కొడుకు యాక్సిడెంట్ కేసులో బిగ్ ట్విస్ట్.. కొచ్చి పోలీస్ కమిషనర్‌పై వేటు.. కారణం ఏంటంటే?

Big Stories

Advertisement
×