Air India Flight Cancel: ఎయిరిండియాలో ఏం జరుగుతోంది..? ఈ ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం దొరకడం లేదు. లేటెస్ట్‌గా నిర్వహణ పరమైన సమస్యల వల్ల 8 విమానాలను రద్దు చేసింది ఎయిరిండియా. దుబాయ్ నుంచి చెన్నై, ఢిల్లీ నుంచి మెల్‌బోర్న్, మెల్‌బోర్న్ నుంచి ఢిల్లీ, దుబాయ్ నుంచి హైదరాబాద్ రావాల్సిన ఫ్లైట్‌లు సహా మరికొన్ని ఈ లిస్ట్‌లో ఉన్నాయి.
ఎయిర్ ఇండియా కథేంటి? పడుతూ లేస్తూ.. ఈ ప్రయాణమేంటి?
ఇంతకీ ఏంటీ ఎయిర్ ఇండియా కథ. పడుతూ లేస్తూ.. ఈ ప్రయాణమేంటి? దీని ఉత్తానపతనాలు మనకేం చెబుతున్నాయి? అసలీ సంస్థను టాటా తిరిగి ఎందుకు తీసుకున్నట్టు? ఇప్పుడీ సంస్థ పరిస్థితి ఏంటి? లాభాలొస్తున్నాయి కదాని భావించే లోపు ఏంటీ నష్టాల పరంపర? ప్రయాణికుల్లో ఒక భరోసా రావాలంటే ఏం చేయాలీ సంస్థ. నిపుణుల అభిప్రాయం ఎలాగుంది?
టాటా గ్రూప్ 74. 9 శాతం. సింగపూర్ ఎయిర్ లైన్స్ 25. 1 శాతం వాటా
అలాగైనా ప్రయాణికుల్లో భరోసా రావచ్చన్న కామెంట్ ఎయిర్ ఇండియా ఈ పేరులోనే ఇండయా అనే పదం ఉండటంతో ఇది విమానయానంలో భారత దేశ ప్రాతినిథ్యాన్ని తెలియ చేస్తుంది. దీని ఆపరేషనల్ హెడ్ ఆఫీస్ కూడా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నషనల్ ఎయిర్ పోర్ట్ లో ఉంటుంది. ఇక బెంగళూరు, ముంబైతో పాటు దేశంలో అనేక ప్రాంతాల్లో విస్తరించిన సంస్థ. హర్యానాలోని గుర్ గామ్ లో.. ప్రధానకార్యాలయం కలగి ఉందీ ఈ సంస్థ. టాటా గ్రూప్ 74. 9 శాతం, సింగపూర్ ఎయిర్ లైన్స్ 25. 1 శాతం వాటాలతో ఎయిర్ ఇండియా లిమిటెడ్ అనే యాజమాన్యంలో ఉంది. నవంబర్ 2024 నాటికి ఈ ఎయిర్ లైన్.. రకరకాల ఎయిర్ బస్సులు, బోయింగ్ విమానాలతో మొత్తం.. 102 దేశీయ అంతర్జాతీయ గమ్య స్థానాలకు తన సర్వీసులను నడుపుతోంది. ఇండిగో తర్వాత ప్రయాణికుల రవాణా పరంగా భారత్ లో రెండో అతి పెద్ద విమానయాన సంస్థ. జూలై 11, 2014న స్టార్ అలయన్స్‌లో 27వ సభ్యునిగా ఉంది ఎయిరిండియా.
1932లో టాటా ఎయిర్ లైన్స్ గా స్థాపన
1932లో JRD టాటా ద్వారా.. టాటా ఎయిర్‌లైన్స్‌గా స్థాపించబడిన ఈ సంస్థ- కరాచీ నుంచి బొంబాయిలోని జుహు ఏరోడ్రోమ్‌కు తొలి ఎయిర్ మెయిల్‌ను మోసుకొచ్చింది. తరువాత చెన్నై వరకు తన సర్వీసును స్వయంగా నడిపింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, అంటే 1953లో జాతీయం చేసింది. ఎయిర్ ఇండియాగా పేరు మార్చింది. 1960లో గౌరీ శంకర్ పేరిట తన మొదటి బోయింగ్- 707 డెలివరీ తీసుకుంది. అయితే ఈ విమానం ఎయిర్ ఇండియా 403 పేరిట క్రాష్ అయ్యింది.
2000- 01లో ఎయిర్ ఇండియా ప్రయివేటీకరణ
జెట్ విమానం చేర్చుకున్న తొలి ఏషియన్ విమానయాన సంస్థ కూడా ఇదే. 2000- 01లో ఎయిర్ ఇండియా ప్రయివేటీకరణ యత్నాలు సాగాయి. 2006 నుంచి ఇండియన్ ఎయిర్ లైన్స్ లో విలీనం తర్వాత నష్టాలను చవి చూసింది. 2017లో మరో ప్రైవేటీకరణ ప్రయత్నం జరిగింది. 2022లో యాజమాన్యం తోపాటు అనుబంధ ఆస్తులు టాటా గ్రూప్‌కి వచ్చాయి.
F24 లో రూ. 31, 377 కోట్ల టర్నోవర్
ఎయిర్ ఇండియా తన అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ద్వారా దేశీయ, ఆసియా గమన్యస్థానాలకు విమానాలను నడుపుతోంది. ఎయిర్ ఇండియా ఎన్నో దేశీయ అంతర్జాతీయ గమ్య స్థానాలకు తన సర్వీసులందిస్తోంది. ఎయిర్ బస్ 320, బోయింగ్ 737, ఎయిర్ బస్ ఏ 350, బోయింగ్ 777, బోయిగ్ 787.. వంటి విమానాలతో ఈ సర్వీసులను అందిస్తోంది. ఎయిర్ ఇండియాకు మొదట మహారాజ, తర్వాత కోణార్క్ చక్రంతో ఎగిరే హంస, 2023లో ద విస్టా అంటూ బంగారు రంగు కిటీకీగా రూపాంతరం చెందింది.
FY25లో రూ. 38,812 కోట్లకు పెరుగుదల
ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి.. ఇటీవలే లాభాల బాట పట్టింది. టాటా గ్రూప్ యాజమాన్యం చేపట్టిన తర్వాత 14 శాతం పెరుగుదల నమోదు చేసింది. నిర్వహణ లాభాలు సైతం చవి చూసింది. బిజినెస్ లైన్ ప్రకారం.. ఫైనాన్షియల్ ఇయర్ 24లో 31, 377 కోట్ల టర్నోవర్‌తో పోలిస్తే.. FY25లో 38,812 కోట్లకు పెరిగింది.
11 శాతం లాభాలతో 7 బి. డా. టర్నోవర్
ఎయిర్ ఇండియా.. ఈ ఏడాది 11 శాతం లాభాల పెరుగుదలతో 7 బిలియన్ డాలర్లకు తన టర్నోవర్ని పెంచుకుంది. ఏవియేషన్ ఏ 2 జెడ్ ప్రకారం.. ఈ పురోగతి, విమానాల విస్తరణ ప్రణాళికలు నష్టాల తగ్గింపు ద్వారా.. ఇది సాధ్యమైనట్టుగా ప్రకటించుకుంది. అంతే కాదు ఎయిర్ ఇండియా తన ఫ్లీట్‌ని ఆధునీకరిస్తోంది. కొత్త ఉత్పత్తులను ప్రవేశ పెడుతోంది. ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని ఇవ్వాలన్న తపన తాపత్రయం కనబరుస్తోంది. మరింతగా ఆదాయ వృద్ధి చేయాలన్న కృత నిశ్చయంతో ఉంది. సరిగ్గా ఈ టైంలో.. ఇలా జరగటంతో యాజమాన్యం షాక్‌కి గురయ్యింది.
సరిగ్గా ఈ టైంలో.. ఇలా జరగటంతో..
తాజాగా తలెత్తుతోన్న సమస్యల కారణంగా.. ఈ విమానాలు సేఫేనా? ప్రయాణికులు ఎక్కి దిగే వరకూ సేఫ్టీ లేదా? అన్న ప్రశ్నకు ఆస్కారమేర్పడుతోంది. చేతులు మారడం వరకూ ఓకేగానీ.. సంస్థలోని విమానాలు, సాంకేతిక పరంగా వాటి స్థితిగతులు.. వీటిపై ఒక నివేదిక ఉందా? లేక గాల్లో దీపంలా తన సర్వీసులను నడుపుతోందా? ఒకే సారి ఇన్ని సమస్యలేంటి? అన్నది ఎవరికీ అర్ధం కావడం లేదు.
థార్డ్ పార్టీ ఫిట్ నెస్ తీస్కోవడం బెటర్
ఏది ఏమైనా థర్డ్ పార్టీ ద్వారా.. ఎయిర్ ఇండియా తన సంస్థలో నడుస్తున్న విమానాలను చెక్ చేయించి.. ఫిట్ నెస్ సర్టిఫికేట్ తీసుకోవడం ఎంతైనా సేఫ్ అన్న కామెంట్ వినిపిస్తోంది. అప్పుడుగానీ సంస్థ పట్ల ప్రయాణికుల్లో ఒక భరోసా రాదన్న అభిప్రాయం వెలుగు చూస్తోంది. మరి చూడాలి.. కంపెనీ కేవలం నష్టపరిహారాలతో సరిపెడుతుందా? లేక ఇలాంటి చర్యల ద్వారా తన ప్రయాణికుల్లో నమ్మకం కలిగిస్తుందా తేలాల్సి ఉంది.