Kuberaa OTT : టాలీవుడ్ ఇండస్ట్రీలో శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రేక్షకుల మనసును హత్తుకునే కథలతో పాటుగా చక్కని మెసేజ్ ను తన సినిమాల ద్వారా అందిస్తాడు. ఈ మధ్య ఈయన తెరకెక్కించిన సినిమాలు మంచి సక్సెస్ ని అందుకున్నాయి. తాజాగా కుబేర చిత్రంతో ప్రేక్షకులను మరోసారి మెస్మరైజ్ చేశారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. తమిళ హీరో ధనుష్, టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమాకు ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. అయితే కుబేర ఓటీటీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ చిత్రం డిజిటల్ హక్కులను ఏ ఓటీటీ సంస్థ సొంతం చేసుకుంది. ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
ఆ ఓటీటీలోకే ‘కుబేర’..
ఇవాళ భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చేసిన కుబేర మూవీ పాజిటివ్ టాక్ తో పాటుగా డైరెక్టర్ అద్భుతంగా చూపించాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. చిత్ర టీజర్, ట్రైలర్ లతో ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. అనుకున్నట్లుగానే థియేటర్లలోకి వచ్చిన తర్వాత అదే టాక్ కొనసాగుతుంది. అయితే ఈ మూవీ డిజిటల్ హక్కులపై ఒక న్యూస్ నెట్టింట ప్రచారంలో ఉంది.. ఈ మూవీ ఓటీటీ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో సినిమాను విడుదల చేశారు. అన్ని భాషల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమెజాన్ దగ్గర ఉన్నాయి.. థియేటర్లలో రిలీజ్ అయిన 8 వారాల తర్వాత ఈ మూవీ స్ట్రీమింగ్ కి రాబోతుందని ముందుగానే ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఈ డీల్ విలువ సుమారు రూ. 47 కోట్లు అని తెలిసింది..
Also Read : సంతోషంతో గుండె నిండిపోయింది.. అస్సలు ఊహించలేదు!
ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే..
ధనుష్ బిచ్చగాడు పాత్ర లో నటించిన కుబేర మూవీలో నాగ్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన సిబిఐ ఆఫీసర్ దీపక్ పాత్రలో అక్కినేని నాగార్జున కనిపించనున్నారు. వాళ్ళిద్దరి చుట్టూ తిరిగే ఈ కథలో ఒక భారీ స్కామ్ కీలక పాత్ర పోషించనుంది. ప్రభుత్వ అధికారులు కొందరు భారీ స్కామ్ చేయడానికి ప్లాన్ చేస్తారు. 14 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ ఫ్యూయల్ స్కామ్ అది. ఆ కుట్రలోకి సిబిఐ ఆఫీసర్ దీపక్ ఎలా వచ్చాడు? బిచ్చగాడు దేవాను ఎలా ఈ ఊబిలోకి లాగాడు? దేవాను ఇందులోకి ఎలా తీసుకొచ్చారు. వీరిద్దరి వల్ల ప్రభుత్వం ఎలాంటి చిక్కులను ఎదుర్కొన్నది..? దేవా ప్రేమ కథ ఏమిటి? రష్మిక క్యారెక్టర్ ఏమిటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.. ఈ మూవీ స్టోరీ గురించి మరింత తెలుసుకోవాలంటే కచ్చితంగా థియేటర్లో కెళ్ళి సినిమాను చూడాల్సిందే. ఇక ఈ మూవీకి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ను అందించారు.. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు లు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు.