AIR INDIA | విమాన ప్రయాణ కోసం లక్షలు ఖర్చుపెట్టి టికెట్ తీసుకుంటే.. ఆ విమానంలో కనీస వసతులు కూడా సరిగాలేవు. ఈ చేదు అనుభవం కుటుంబసమేతంగా ఢిల్లీ నుంచి టొరొంటో(కెనెడా) వరకు విమానంలో ప్రయాణించాలనుకున్న ఒక మహిళకు ఎదురైంది.

శ్రేతి గార్గ్ అనే మహిళ తన కుటుంబం(భర్త, ఇద్దరు చిన్నారులు)తో ఢిల్లీ నుంచి టొరొంటో వెళ్లేందుకు రూ.4.5 లక్షలు ఖర్చు చేసి ఎయిర్ ఇండియా టికెట్స్ తీసుకుంది. ప్రయాణం రోజు విమానంలోకి వెళ్లే సీట్లకు హ్యాండిల్స్ లేవు. కుర్చీలకు ఎదురుగా ఉన్న టీవి స్క్రీన్స్ పనిచేయడం లేదు. సీట్ల లోపలి నుంచి వైర్లు బయటకు వేలాడుతున్నాయి.
పిల్లలు(2.5 సంవత్సరాలు, ఏడు నెలలు) కూర్చోవాల్సిన సీట్లలో వైర్లు వేలాడుతుంటే వారికేమైనా హానీకలుగుతుందేమోనని ప్రతిక్షణం చూసుకుంటు గడపాల్సి వచ్చింది. సిబ్బందికి ఫిర్యాదు చేసినా వారు ఏమీ చేయలేమని చెప్పారు. టీవీ స్క్రీన్లు సరిచేస్తామని సిబ్బంది చెప్పి వెళ్లిపోయారు. కానీ ఫలితం లేదు. ఇదంతా జరుగుతుంటే.. మరోవైపు లైట్లు పనిచేయడం లేదు. దీంతో 16 గంటలపాటు ప్రయాణంలో పిల్లలను చూసుకుంటూ ఆ చీకటిలో ఆమె నానా ఇబ్బందులు పడింది.
ఎయిర్ ఇండియా సర్వీసు ఏ స్థాయిలో ఉందో చూడండి అంటూ ఆమె ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు. ఇప్పుడా పోస్టు తెగ వైరల్ అవుతోంది.