E-Paper
Advertisement

విడాకుల రోజే రెండో పెళ్లి చేసుకున్నారా? తీర్పురాక ముందే.. చెల్లుబాటు అవుతుందా?

విడాకుల రోజే రెండో పెళ్లి చేసుకున్నారా? తీర్పురాక ముందే.. చెల్లుబాటు అవుతుందా?
Advertisement

Second Marriage Without Divorce| ఒకే రోజు రెండు కీలక సంఘటనలు జరిగితే చట్టపరంగా ఎలాంటి పరిణామాలు ఉంటాయి? మొదటి భర్తతో విడాకుల తీర్పు వెలువడిన రోజే ఓ మహిళ రెండో పెళ్లి చేసుకుంది. అయితే విడాకుల తీర్పు కంటే ముందే పెళ్లి జరిగింది. దీంతో రెండో పెళ్లి చట్టపరంగా చెల్లుతుందా? ఈ వివాదంపై కేరళ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హిందూ వివాహ చట్టంలోని నిబంధనలను వివరిస్తూ ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది.

పెళ్లి చెల్లుబాటుపై అభ్యంతరం వ్యక్తం చేసిన రెండో భర్త

ఈ మహిళకు మొదటి వివాహం నుంచి విడాకులు 2007 డిసెంబర్ 28న వచ్చాయి. అంతకుముందే అదే రోజు రెండో వివాహం జరిగినట్లు రెండో భర్త పేర్కొన్నాడు. ఉదయం 10 గంటలకే తమ పెళ్లి పూర్తయిందని, మొదటి భర్తతో విడాకుల తీర్పు ఉదయం 11 గంటల తర్వాత వెలువడిందని వాదించాడు.

Advertisement

2023లో రెండో భర్త నుంచి విడాకులు కోరుతూ మహిళ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ సమయంలో రెండో భర్త తన వివాహం చెల్లదని ప్రకటించాలని కోరాడు. అందుకోసం తన పిటిషన్‌లో కొత్త అంశాలను చేర్చేందుకు అనుమతి కోరాడు. ఫ్యామిలీ కోర్టు అందుకు అంగీకరించగా, మహిళ కేరళ హైకోర్టును ఆశ్రయించింది.

విడాకుల తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవడానికి నిబంధనలివే

హిందూ వివాహ చట్టం.. 1955లోని సెక్షన్ 15 ప్రకారం విడాకుల తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. విడాకుల తీర్పుపై అప్పీల్ చేసుకునే గడువు ముగియాలి. అప్పీల్ దాఖలైతే అది కొట్టివేయబడాలి. అప్పుడే తిరిగి వివాహం చేసుకోవడానికి చట్టపరమైన అనుమతి ఉంటుంది. అయితే ఈ నిబంధనలను ఉల్లంఘించి జరిగిన ప్రతి వివాహం ఆటోమేటిక్‌గా చెల్లదని చెప్పలేమని హైకోర్టు పేర్కొంది. అలాంటి వివాహాన్ని మొదటి భర్త సవాలు చేసే అవకాశం ఉంటుందని వివరించింది.

Advertisement

Also Read: న్యూమరాలజీ.. ఈ తేదీల్లో జన్మించిన అబ్బాయి అల్లుడిగా దొరికితే అత్తమామలకు అదృష్టం పట్టినట్లే

విడాకుల తీర్పు అదే తేదీ నుంచి అమల్లోకి

తీర్పు ఉదయం 11 గంటల తర్వాత వెలువడిందన్న వాదనను హైకోర్టు అంగీకరించలేదు. తీర్పు వెలువడిన తేదీ ప్రారంభం నుంచే అది అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. తీర్పు వెలువడిన కచ్చితమైన సమయాన్ని నమోదు చేయాలని చట్టం తప్పనిసరి చేయడం లేదని వివరించింది.

Also Read: విడాకుల కోసం భారీగా డబ్బు డిమాండ్ చేసిన భార్య.. ఇచ్చాక మాట తప్పిందని కోర్టుకెక్కిన భర్త

మొదటి భర్తకు అభ్యంతరం లేదు కదా..

మహిళకు మొదటి వివాహం నుంచి పరస్పర అంగీకారంతో సెక్షన్ 13బీ కింద విడాకులు వచ్చాయి. మొదటి భర్త ఆమె రెండో వివాహాన్ని సవాలు చేయలేదు. అలాంటప్పుడు రెండో భర్త ఆ వివాహాన్ని చెల్లనిదిగా ప్రకటించాలని కోరలేడని హైకోర్టు పేర్కొంది.
అలాగే ఒకవైపు వివాహం చెల్లుబాటు అవుతుందని చెబుతూ విడాకులు కోరడం, మరోవైపు అదే వివాహం చెల్లదని వాదించడం పరస్పర విరుద్ధమని తెలిపింది.

చివరకు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన అనుమతిని హైకోర్టు రద్దు చేసింది. ఈ తీర్పు సెక్షన్ 15 నిబంధనలను తొలగించదు. వివాహ వివాదాల్లో చట్టపరమైన విధానాలను పాటించడం ఎంత ముఖ్యమో ఈ కేసు స్పష్టం చేస్తోంది.

Related News

విగతజీవిగా ఇండిగో ఉద్యోగిని.. అసలేం జరిగింది? రంగంలోకి దిగిన పోలీసులు!

డేటింగ్‌ యాప్‌ లవ్.. యువకుడికి ఫ్యూజులు ఎగిరాయి, హర్యానాలో షాకింగ్ ఘటన

మరో 30 ఏళ్లయినా కాంగ్రెస్‌కు అధికారం దక్కదు: అమిత్ షా

రాజస్థాన్ రైల్వే ట్రాక్ పేలుడు వెనుక పాక్ గూఢచార సంస్థ.. డ్రోన్ల ద్వారా ఆయుధాల సరఫరా

ఒక చిన్న ప్రాణం.. గొప్ప మనసు.. ఇది ప్రతీ ఒక్కరూ చూడాల్సిందే!

పబ్‌జీలో కలిశారు.. మూడేళ్లు ప్రేమించుకున్నారు.. కట్ చేస్తే గెస్ట్ హౌస్‌లో..

ఘోర ప్రమాదం.. ట్యాంకర్ నుంచి లీకైన హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఊరి మొత్తాన్ని కమ్మేసింది

Big Stories

Advertisement
×