E-Paper
Advertisement

BSNL బంపరాఫర్.. రూ.51కే కొత్త సిమ్.. అపరిమిత కాల్స్, డైలీ 2GB డేటా!

BSNL బంపరాఫర్.. రూ.51కే కొత్త సిమ్.. అపరిమిత కాల్స్, డైలీ 2GB డేటా!
Advertisement

BSNL Rs 51 Offer: ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) సామాన్యుల కోసం అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం రూ. 51 చెల్లించి కొత్త బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు తీసుకోవడంతో పాటు నెల రోజుల పాటు ఉచిత కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ ప్రయోజనాలను పొందే వెసులుబాటును కల్పించింది. ఈ ప్రమోషనల్ ఆఫర్ పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రైవేటు కంపెనీల టెలికాం యూజర్లు బీఎస్ఎన్ఎల్ కు మారేందుకు ఇదే బెస్ట్ ఆప్షన్ అని సూచించాయి.

రూ. 51 ప్లాన్‌ బెనిఫిట్స్..

రూ. 51 చెల్లించి కొత్త సిమ్ తీసుకునే వినియోగదారులకు 28 రోజుల వ్యాలిడిటీతో అనేక బెనిఫిట్స్ ను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. ప్రతిరోజూ 2GB హై స్పీడ్ ఇంటర్నెట్ డేటా ఆఫర్ చేస్తోంది. అంటే 28 రోజులకు కలిపి మొత్తం 56GB డేటాను యూజర్లు వాడుకోవచ్చు. అంతేకాకుండా 28 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఏ నెట్ వర్క్ కైనా అపరిమిత ఫ్రీ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించుకునే సదుపాయం కూడా కల్పిస్తోంది.

ఈ ఆఫర్ ఎవరికి ఉపయోగం?

Advertisement

కొత్తగా బీఎస్ఎన్ఎల్ లోకి మారాలని భావిస్తున్న వారికోసం రూ.51 ప్లాన్ ఆఫర్ ను తీసుకొచ్చారు. ప్రస్తుతం ఎయిర్‌టెల్, జియో, వీఐ (Vi) నెట్‌వర్క్‌లు వాడుతున్న వారు తక్కువ ఖర్చుతో టెలికాం సేవలను పొందాలనుకుంటే బీఎస్ఎన్ఎల్‌కు జంప్ అవ్వొచ్చని టెలికాం నిపుణులు సూచిస్తున్నారు. పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టకుండా బీఎస్ఎన్ఎల్ సేవలను పొందేందుకు ఇదే మంచి ఛాన్స్ అని పేర్కొంటున్నారు.

Also Read: రూ.299కే 1.5GB డైలీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్.. ఏడాది పాటు ఆ సేవలు ఉచితం!

నెలాఖరు వరకే ఛాన్స్

Advertisement

రూ.51 ప్లాన్ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. నవంబర్ 30వ తేదీని ఇందుకు తుదిగడువుగా నిర్ణయించింది. తమ సమీపంలోని బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్, రిటైలర్‌ను సంప్రదించి కొత్త సిమ్ పొందవచ్చని తెలియజేసింది. అయితే అయితే టెలికాం సర్కిళ్లను బట్టి ప్రమోషనల్ పథకాల్లో కొన్ని మార్పులు ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి సిమ్ కొనుగోలు చేసే ముందే తమ ఏరియాలో రూ. 51 ఆఫర్ అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకుంటే బెటరని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: 72 రోజుల వ్యాలిడిటీ.. ఫ్రీగా హాట్ స్టార్, అన్‌లిమిటెడ్ 5G.. ఈ జియో ప్లాన్‌ భలే ఉందే!

Tags

Related News

రూ.299కే 1.5GB డైలీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్.. ఏడాది పాటు ఆ సేవలు ఉచితం!

72 రోజుల వ్యాలిడిటీ.. ఫ్రీగా హాట్ స్టార్, అన్‌లిమిటెడ్ 5G.. ఈ జియో ప్లాన్‌ భలే ఉందే!

పోయిన ఐఫోన్ దొరికిందని మెసేజ్ వచ్చిందా? ఆ లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ.. కేంద్రం వార్నింగ్!

స్మార్ట్‌ఫోన్లకు పోటీగా HMD 2320 Flip 4G ఫ్లిప్ ఫోన్.. వాకీ-టాకీ ఫీచర్, టైప్-సీ ఛార్జింగ్‌తో అదరగొట్టే స్పెసిఫికేషన్లు!

క్రియేటర్లు, స్టూడెంట్లకు జియో బంపర్ గిఫ్ట్.. రూ.349 రీఛార్జ్‌తో ఏడాది పాటు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్!

డిజైన్ చూపించి ఊరించిన హువావే.. కొత్త ఫోల్డబుల్ ఫోన్ ఫీచర్లు లీక్, 16GB ర్యామ్‌తో త్వరలోనే ఎంట్రీ!

Jio రీఛార్జ్ గడువు ముగిస్తే ఇన్‌కమింగ్ కాల్స్ కూడా బంద్? సిమ్ యాక్టివ్‌గా ఉండాలంటే ఇలా చేయండి!

Big Stories

Advertisement
×