Love in Dating App: పాత పద్దతులు మానేసి.. కొత్తవాటికి అలవాటు పడుతున్నారు నేటి తరం యువతీ యువకులు. ఆ సమయంలో మోసాలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలం భారత్‌లో డేటింగ్ యాప్‌ని విస్తారంగా వినియోగిస్తున్నారు. కేవలం ఉద్యోగులు తమ అభిప్రాయాలను చెప్పుకునేవారు. ఇప్పుడు వివాహాలను అందులో వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడు అదే చేశాడు. చివరకు అతడికి ఫ్యూజులు ఎగిరిపోయాయి.
కెనడాకు చెందిన ఓ మహిళ ఈనెల 11న టూరిస్ట్ వీసాపై ఇండియాకు వచ్చింది. ఆమె రావడానికి కారణాలు చాలానే ఉన్నాయి. హర్యానాలోని పానిపట్‌కు చెందిన 31 ఏళ్ల నితిన్ తో ఆమెకు డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్త లవ్‌గా మారింది, చివరకు వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇంతవరకు స్టోరీ బాగానే సాగింది. ఆ యువకుడు రాజస్థాన్‌లోని నీమ్రానాలో బంధువుల వద్ద ఉంటున్నాడు.