Lion Chase: గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో ఉన్న అంబర్ది సఫారీ పార్క్‌లో సింహాల పట్ల అటవీ శాఖ సిబ్బంది వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. సఫారీ పార్క్‌లో ఓ సింహాన్ని సిబ్బంది మోటార్ సైకిళ్లపై వెంబడిస్తూ తరమడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ కావడంతో జంతు ప్రేమికులు, నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
వైరల్ అవుతున్న దృశ్యాలలో ముగ్గురు వ్యక్తులు వేర్వేరు బైకులపై సింహాన్ని చుట్టుముట్టి.. ఓపెన్ గ్రౌండ్ వైపు పరుగెత్తేలా చేశారు. బైక్ నడుపుతున్న వారిలో ఒకరి చేతిలో వాకీ-టాకీ ఉండటం, అలాగే అటవీ శాఖకు చెందిన ప్రభుత్వ బొలెరో వాహనం కూడా ఆ ప్రాంతం గుండా వెళ్లడం వీడియోలో రికార్డయింది. దీపావళి సెలవుల సందర్భంగా పార్క్‌కు వచ్చిన వీఐపీ అతిథులకు సింహాన్ని అతి సమీపం నుంచి చూపించేందుకే సిబ్బంది ఇలా అత్యుత్సాహం ప్రదర్శించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే సిబ్బంది అన్ని వైపుల నుంచి తరిమేసరికి విసిగిపోయిన ఆ సింహం.. తిరిగి వారిపైకే దూసుకెళ్లడం కూడా వీడియోలో రికార్డయింది.
వీడియో వైరల్‌గా మారడంతో అటవీ శాఖ ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ ఘటనపై ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) జైపాల్ సింగ్ మాట్లాడుతూ.. సాయంత్రం వేళల్లో సింహాన్ని దాని ఆవాసమైన ‘క్రాల్’ (ఎన్‌క్లోజర్) వైపు మళ్లించే క్రమంలో సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా బైకులను ఉపయోగించారని తెలిపారు. సాధారణంగా ఈ ప్రక్రియను జీపుల ద్వారా మాత్రమే చేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. విచారణ అనంతరం బాధ్యులైన ముగ్గురు ఔట్‌సోర్సింగ్ అటవీ సిబ్బందిని విధుల నుంచి తొలగించడంతో పాటు సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు.
Also Read: ఏపీ రాజకీయాలు కొత్త మలుపు.. కూటమిలో భారీ కుదుపు, ఫ్రెండ్లీ పోటీకి బీజేపీ సై
మరోవైపు సింహాన్ని వేధించారన్న ఆరోపణలను ఇన్‌ఛార్జ్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (ఏసీఎఫ్) మితేష్ వనియా తోసిపుచ్చారు. దీపావళి పండుగ సమయంలో ఈ వీడియో చిత్రీకరించారని ధృవీకరించారు. సుమారు 300 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ సఫారీ పార్క్‌లో ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు సింహాలకు ఆహారం అందిస్తారని తెలిపారు. ఇందుకోసం ‘క్రాల్’ అని పిలిచే 100×100 మీటర్ల కంచె వేసిన ప్రాంతానికి వాటిని తరలిస్తారని పేర్కొన్నారు. ఆ సమయంలో సింహాన్ని లోపలికి పంపేందుకే సిబ్బంది ప్రయత్నించారే తప్ప దానిని వేధించాలనే ఉద్దేశం ఏమాత్రం లేదని మితేష్ వనియా వివరించారు.
Viral Video: Men On Bike Chase Lion On Motorcycles At Gujarat Safari Park https://t.co/BMNtxORP3h
— The News Now (@NewsNowJK) November 16, 2026
Also Read: క్రియేటర్లు, స్టూడెంట్లకు జియో బంపర్ గిఫ్ట్.. రూ.349 రీఛార్జ్‌తో ఏడాది పాటు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్!