E-Paper
Advertisement

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. మగ ఉద్యోగులకు 15 రోజులు పితృత్వ సెలవులు.. తమిళనాడు చరిత్రలో ఫస్ట్ టైమ్!

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. మగ ఉద్యోగులకు 15 రోజులు పితృత్వ సెలవులు.. తమిళనాడు చరిత్రలో ఫస్ట్ టైమ్!
Advertisement

Paternity Leave: తమిళనాడులోని పెళ్లైన పురుష ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తీపి కబురు అందించారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పురుష ఉద్యోగులకు 15 రోజుల పాటు పితృత్వ సెలవులు (Paternity Leave) మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు గురువారం తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా పత్రికా ప్రకటనను విడుదల చేసింది.

సెలవుల వినియోగం ఇలా..

ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. మగ ఉద్యోగులు తమ వెసులుబాటును బట్టి ఈ సెలవులను ఉపయోగించుకోవచ్చు. బిడ్డ పుట్టబోయే తేదీకి 15 రోజుల ముందు నుంచైనా లేదా బిడ్డ జన్మించిన ఆరు నెలల లోపు ఎప్పుడైనా ఈ 15 రోజుల సెలవులను తీసుకునే అవకాశాన్ని తమిళనాడు ప్రభుత్వం కల్పించింది.

ఉద్యోగుల విజ్ఞప్తి మేరకే నిర్ణయం

Advertisement

ప్రస్తుతం తమిళనాడులో మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు 365 రోజుల పాటు ప్రసూతి సెలవులు (Maternity Leave) అందుబాటులో ఉన్నాయి. ఇదే తరహాలో తమకు కూడా పితృత్వ సెలవులు మంజూరు చేయాలని పురుష ఉద్యోగుల నుంచి ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు అందాయి. వారి అభ్యర్థనలను పరిశీలించిన ప్రభుత్వం.. ఈ మేరకు సానుకూల నిర్ణయం తీసుకుంది.

Also Read: ఆయనకు 75, ఆమెకు 63.. వృద్ధాశ్రమంలో చిగురించిన ప్రేమ.. హిమాచల్‌లో వింత పెళ్లి!

తల్లి, బిడ్డల సంరక్షణ కోసమే..

Advertisement

ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాన్ని కూడా విజయ్ ప్రభుత్వం స్పష్టంగా వివరించింది. ప్రసవ సమయం అనేది తల్లికి, నవజాత శిశువుకు ఎంతో కీలకమైనదని పేర్కొంది. ఆ సమయంలో తల్లికి శారీరకంగా, మానసికంగా తగిన తోడ్పాటు అవసరమని అభిప్రాయపడింది. అలాగే బిడ్డ సంరక్షణలో తండ్రి భాగస్వామ్యం కూడా ఎంతో ముఖ్యమని ప్రభుత్వం భావించింది. ప్రసూతి సమయంలో భార్యకు అండగా నిలవడంతో పాటు.. నవజాత శిశువు పెంపకంలో తండ్రులు తమ బాధ్యతను పంచుకునేందుకు వీలుగా ఈ సెలవులను ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం వివరించింది.

Also Read: పులి vs సింహం.. ముఖాముఖి పోరులో పైచేయి దేనిది? నిపుణుల ఆసక్తికర విశ్లేషణ!

Tags

Related News

ఆయనకు 75, ఆమెకు 63.. వృద్ధాశ్రమంలో చిగురించిన ప్రేమ.. హిమాచల్‌లో వింత పెళ్లి!

2 అడుగుల బర్రె.. ధర ఏకంగా రూ. కోటి.. ప్రపంచంలోనే అత్యంత చిన్నది ఇదేనా?

ఉమర్​ ఖలీద్​, షర్జిల్​ ఇమామ్‌కు బిగ్ షాక్.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం!

రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు కొట్టివేత!

మందు బాబులకు వైద్యుల షాక్.. వైన్ షాపుల బయటే హెల్త్ క్యాంప్!

కోర్టు వెలుపలే దారుణం.. హత్య కేసు నిందితుడిపై వేటకొడవళ్లతో దాడి.. భయానక దృశ్యాలు వైరల్!

సుప్రీం ఆదేశాలు ఉన్నా.. తిరుప్పరంకుండ్రంలో వెలగని దీపం.. కారణాలేంటో కుండబద్దలు కొట్టిన మధురై కలెక్టర్!

Big Stories

Advertisement
×