Umar Khalid: ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో అరెస్ట్ అయిన ఉమర్ ఖలీద్, షర్జిల్ ఇమామ్ లకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై స్పందన తెలియచేయాలంటూ ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీలో అల్లర్లు సృష్టించటానికి కుట్రలు చేశారన్న నేరారోపణలపై పోలీసులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిరోధక చట్టం (ఉపా) ప్రకారం ఉమర్ ఖలీద్, షర్జిల్ ఇమామ్ లను 2020లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఈ ఇద్దరు జైల్లోనే ఉన్నారు. గతంలో బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థిస్తూ కోర్టులో పిటిషన్లు వేయగా ఉపా చట్టం ప్రకారం నమోదైన కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయంటూ కోర్టు వాటిని తిరస్కరించింది.
Also Read: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు కొట్టివేత!
కాగా, విచారణలో జరుగుతున్న జాప్యం, నిర్బంధ కాలాన్ని ప్రస్తావిస్తూ ఇద్దరు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరిపింది. నిందితులు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. ఈ కేసును విచారించేందుకు తగిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు.
Also Read: మందు బాబులకు వైద్యుల షాక్.. వైన్ షాపుల బయటే హెల్త్ క్యాంప్!