E-Paper
Advertisement

ఎమ్మెల్యే కూతురి పెళ్లిలో కరెన్సీ నోట్ల వర్షం.. చీపురుతో ఊడుస్తున్న దృశ్యాలు వైరల్!

ఎమ్మెల్యే కూతురి పెళ్లిలో కరెన్సీ నోట్ల వర్షం.. చీపురుతో ఊడుస్తున్న దృశ్యాలు వైరల్!
Advertisement

Viral Wedding: బిహార్ లోని మొకామా నియోజకవర్గ ఎమ్మెల్యే అనంత్ సింగ్ చిన్న కూతురి పెళ్లి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. శివాంగి సింగ్ వివాహ వేడుకలో కరెన్సీ నోట్లను వర్షంలా కురిపించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. కిందపడ్డ రూ.10, 20, 50 నోట్లను చీపురుతో పక్కకు ఊడుస్తున్న దృశ్యాలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

పాట్నా జిల్లాలోని నద్వాన్‌లో బుధవారం శివాంగి, రిషికేష్ కుమార్‌ల పెళ్లి జరిగింది. ఈ వేడుకకు భారీ సంఖ్యలో అతిథులు, జనం తరలివచ్చారు. ఈ సందర్భంగా వధూవరులపై నోట్ల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. రూ.లక్షలు విలువ చేసే కరెన్సీని మండపంలో కురిపించడం స్థానికంగా పెద్ద చర్చకే తావిచ్చింది. ఈ క్రమంలోనే కిందపడ్డ నోట్లను చీపురుతో ఊడుస్తున్న దృశ్యాలు సైతం బయటకు వచ్చాయి. అయితే అవన్నీ ఫేక్ కరెన్సీ అని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

Advertisement

ఈ పెళ్లిలో భోజన ఏర్పాట్లను సైతం ఘనంగా చేశారు. అతిథులకు 150కి పైగా వంటకాలను వడ్డించినట్లు తెలుస్తోంది. వీటిలో సంప్రదాయ బిహారీ వంటకాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల ఫేమస్ ఫుడ్స్ కూడా ఉన్నాయి. భోజనం పూర్తిగా శాఖాహారమే అయినా.. రకరకాల ఐటమ్స్ పెట్టడం అతిథులను ఎంతగానో ఆకట్టుకుంది. మెుత్తం 300 పొయ్యిలపై 500 మంది వంటవాళ్లు ఈ రుచికరమైన ఫుడ్ ను వండినట్లు తెలుస్తోంది. అయితే అంచనాకు మించి ప్రజలు పోటెత్తడంలో భోజనాల దగ్గర గందరగోళం ఏర్పడింది. ప్రజలు భోజనం కోసం ఎగబడిన దృశ్యాలు సైతం వైరల్ అవుతున్నాయి.

Advertisement

Also Read: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. మగ ఉద్యోగులకు 15 రోజులు పితృత్వ సెలవులు.. తమిళనాడు చరిత్రలో ఫస్ట్ టైమ్!

మరోవైపు ఎమ్మెల్యే అనంత్ సింగ్.. పెళ్లి కూతురైన శివాంగికి ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును బహుమతిగా అందజేశారు. దీని విలువ రూ.2.5 నుంచి రూ.3 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. అలాగే అనంత్ సింగ్ తన చిన్న కొడుకు అభినవ్‌కు సైతం సుమారు రూ. కోటి విలువైన బీఎండబ్ల్యూ కారును ఇచ్చారు. అక్క పెళ్లితో పాటే అభినవ్ ఉపనయనం వేడుక కూడా జరగడంతో.. ఎమ్మెల్యే కుటుంబంలో ఆనందం రెట్టింపు అయ్యింది.

Also Read: హ్యుందాయ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఐయోనిక్ P లాంచింగ్ ఎప్పుడంటే?

Tags

Related News

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. మగ ఉద్యోగులకు 15 రోజులు పితృత్వ సెలవులు.. తమిళనాడు చరిత్రలో ఫస్ట్ టైమ్!

ఆయనకు 75, ఆమెకు 63.. వృద్ధాశ్రమంలో చిగురించిన ప్రేమ.. హిమాచల్‌లో వింత పెళ్లి!

2 అడుగుల బర్రె.. ధర ఏకంగా రూ. కోటి.. ప్రపంచంలోనే అత్యంత చిన్నది ఇదేనా?

ఉమర్​ ఖలీద్​, షర్జిల్​ ఇమామ్‌కు బిగ్ షాక్.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం!

రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు కొట్టివేత!

మందు బాబులకు వైద్యుల షాక్.. వైన్ షాపుల బయటే హెల్త్ క్యాంప్!

కోర్టు వెలుపలే దారుణం.. హత్య కేసు నిందితుడిపై వేటకొడవళ్లతో దాడి.. భయానక దృశ్యాలు వైరల్!

Big Stories

Advertisement
×