E-Paper
Advertisement

ఆయనకు 75, ఆమెకు 63.. వృద్ధాశ్రమంలో చిగురించిన ప్రేమ.. హిమాచల్‌లో వింత పెళ్లి!

ఆయనకు 75, ఆమెకు 63.. వృద్ధాశ్రమంలో చిగురించిన ప్రేమ.. హిమాచల్‌లో వింత పెళ్లి!
Advertisement

Elderly Couple Marriage: హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో ఆసక్తికర వివాహం జరిగింది. ఒకప్పుడు అడవిలోని గుహలో తలదాచుకున్న 75 ఏళ్ల వృద్ధుడు, దారితప్పి అయోమయ స్థితిలో దొరికిన 63 ఏళ్ల మహిళ.. ఇద్దరూ ఒకే వృద్ధాశ్రమంలో కలుసుకుని వివాహం చేసుకున్నారు. కన్నయ్య లాల్, సబీనాల ఈ వివాహం.. ఇప్పుడు యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది.

బిలాస్ పూర్ లోని ఘాఘాస్ ప్రాంతంలో గల ‘అప్నా ఘర్’ వృద్ధాశ్రమంలో బుధవారం (నవంబర్ 25) వీరి పెళ్లి జరిగింది. హిందూ సంప్రదాయాల ప్రకారం కన్నయ్య, సబీనాలు ఒక్కటయ్యారు. పూలదండలు మార్చుకొని, ఏడు అడుగులు నడిచి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లికి ముందురోజు (మంగళవారం హల్దీ, మెహందీ వేడుకలు సైతం వధూవరులు జరుపుకున్నారు. పసుపు రంగు దుస్తుల్లో మెరిశారు. హిమాచల్ పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ వేడుకలో హల్ చల్ చేశారు.

Advertisement

ఈ వృద్ధుల పెళ్లికి సుమారు 200 మంది దాకా హాజరయ్యారు. ఆశ్రమంలో ఉంటే వారితో పాటు స్థానికులు, ప్రభుత్వ అధికారులు కూడా వచ్చి కొత్త జంటను ఆశీర్వదించారు. బిలాస్‌పూర్ డిప్యూటీ కమిషనర్ కిరణ్ భదానా స్వయంగా హాజరై, వధూవరులకు శుభాకాంక్షలు చెప్పి పెళ్లి కానుక అందించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘జీవితం ఎప్పుడూ రెండో అవకాశాన్ని ఇస్తూనే ఉంటుంది. దాన్ని సంతోషంగా స్వీకరించి ముందుకు సాగాలి’ అని అన్నారు.

Advertisement

కన్నయ్య లాల్ విషయానికి వస్తే ఆయన తన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించారు. మండి జిల్లా జంజెహ్లీలోని థునాగ్ గ్రామానికి చెందిన ఆయనకు గతంలోనే పెళ్లి కాగా భార్య చనిపోయింది. పిల్లలు లేకపోవడంతో తనకున్న ఇల్లు, కొద్దిపాటి భూమిని సోదరులకు రాసిచ్చేశారు. తర్వాత కుటుంబ సభ్యులే ఆయన్ను బయటకి పంపేశారు. దీంతో అడవిలోని గుహలో జీవనం సాగిస్తూ వచ్చారు. 2022లో ఆయన్ను గుర్తించి అధికారులు ఆశ్రమానికి తీసుకొచ్చారు.

Also Read: పులి vs సింహం.. ముఖాముఖి పోరులో పైచేయి దేనిది? నిపుణుల ఆసక్తికర విశ్లేషణ!

ఇక సబీనా గురించి చెప్పుకుంటే.. ఆమెది కోల్ కత్తా. కుటుంబ సభ్యుల నుంచి వేరుబడి సిమ్లా ప్రాంతానికి వచ్చారు. అక్కడ అయోమయ స్థితిలో ఉన్న ఆమెను పోలీసులు గుర్తించి మషోబ్రాలోని ‘నారీ నికేతన్’ మహిళా ఆశ్రమానికి తరలించారు. ఆ తర్వాత 2025లో ఆమెను బిలాస్‌పూర్‌లోని అప్నా ఘర్ వృద్ధాశ్రమానికి మార్చారు. అక్కడే కన్నయ్య లాల్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి సమయం గడపడం మొదలుపెట్టారు. కష్టాల్లో ఉన్న ఒకరికొకరు అండగా నిలుస్తూ.. చివరికి వివాహం బంధంతో ఒక్కటయ్యారు.

Also Read: 2 అడుగుల బర్రె.. ధర ఏకంగా రూ. కోటి.. ప్రపంచంలోనే అత్యంత చిన్నది ఇదేనా?

Tags

Related News

2 అడుగుల బర్రె.. ధర ఏకంగా రూ. కోటి.. ప్రపంచంలోనే అత్యంత చిన్నది ఇదేనా?

ఉమర్​ ఖలీద్​, షర్జిల్​ ఇమామ్‌కు బిగ్ షాక్.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం!

రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు కొట్టివేత!

మందు బాబులకు వైద్యుల షాక్.. వైన్ షాపుల బయటే హెల్త్ క్యాంప్!

కోర్టు వెలుపలే దారుణం.. హత్య కేసు నిందితుడిపై వేటకొడవళ్లతో దాడి.. భయానక దృశ్యాలు వైరల్!

సుప్రీం ఆదేశాలు ఉన్నా.. తిరుప్పరంకుండ్రంలో వెలగని దీపం.. కారణాలేంటో కుండబద్దలు కొట్టిన మధురై కలెక్టర్!

‘బయటకు వెళ్దాం.. నేను చెప్పిన బట్టలు వేసుకో’.. విద్యార్థినికి టీచర్ అసభ్యకర మెసేజ్‌లు!

Big Stories

Advertisement
×