E-Paper
Advertisement

రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు కొట్టివేత!

రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు కొట్టివేత!
Advertisement

Rahul Gandhi: లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్​ అగ్రనాయకుడైన రాహుల్​ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై విచారణ జరపాలంటూ సీబీఐ, ఈడీలను ఆదేశిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చి ఉత్తర్వులను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది.

రాహుల్​ గాంధీ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ బీజేపీ కార్యకర్త విఘ్నేశ్ శిశిర్​ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన అలహాబాద్​ హైకోర్టు దర్యాప్తు చేయాలంటూ సీబీఐ, ఈడీలను ఆదేశించింది. దీనిని సవాల్ చేస్తూ రాహుల్​ గాంధీ సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు.

Advertisement

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. అసలు, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్ విచారణకు అర్హమైందా? కాదా? అన్నది పునఃపరిశీలన చేయాలని అలహాబాద్ హైకోర్టునే ఆదేశించింది.

Also Read: హైదరాబాద్‌ను భయపెడుతున్న నీటి గండం.. ఏడాదిలో 4 రెట్లు పెరిగిన ట్యాంకర్ బుకింగ్స్!

Advertisement

రాహుల్ గాంధీ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారంటూ కర్ణాటకు చెందిన బీజేపీ కార్యకర్త విఘ్నేశ్‌ శిశిర్‌ గతంలో ఆరోపించారు. ఈ విషయంలో రాహుల్‌ తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపైనా దర్యాప్తు జరపాలని కోరుతూ అలహాబాద్‌ హైకోర్టును కోరారు. ఈ పిటిషన్‌ పై విచారణ జరిపిన అలహాబాద్‌ హైకోర్టు మే నెలలో సీబీఐ, ఈడీకి ఈ ఆరోపణలను పరిశీలించి, ధృవీకరించాలని ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు పురోగతిని తమకు తెలియజేయాలని పేర్కొంది. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో రాహుల్ కు కాస్త ఊరట లభించినట్లైంది.

Also Read: 5 సంవత్సరాలలో 5 లక్షలకు పైగా వడ్డీ… ఈ అద్భుతమైన పోస్ట్ ఆఫీస్ పథకం గురించి తెలుసా ?

Tags

Related News

మందు బాబులకు వైద్యుల షాక్.. వైన్ షాపుల బయటే హెల్త్ క్యాంప్!

కోర్టు వెలుపలే దారుణం.. హత్య కేసు నిందితుడిపై వేటకొడవళ్లతో దాడి.. భయానక దృశ్యాలు వైరల్!

సుప్రీం ఆదేశాలు ఉన్నా.. తిరుప్పరంకుండ్రంలో వెలగని దీపం.. కారణాలేంటో కుండబద్దలు కొట్టిన మధురై కలెక్టర్!

‘బయటకు వెళ్దాం.. నేను చెప్పిన బట్టలు వేసుకో’.. విద్యార్థినికి టీచర్ అసభ్యకర మెసేజ్‌లు!

ఢిల్లీలో మరో ఘోరం.. కేఫ్‌లో యువతిపై సామూహిక అత్యాచారం.. తోటి ఉద్యోగులే కీచకులు!

అన్ని బంధాలు తెంచుకున్నాం.. బతికి ఉండగానే కూతురికి అంత్యక్రియలు, మధ్యప్రదేశ్‌లో దారుణమైన ఘటన

OYO గదిలో డిగ్రీ యువతి మృతి.. పత్తాలేని ప్రియుడు, హర్యానాలో షాకింగ్ ఘటన

Big Stories

Advertisement
×