
Wrestling Federation of India:- రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై యాక్షన్ తీసుకోవాల్సిందేనంటున్నారు ఒలింపియన్ రెజర్లు. ఒలింపిక్ విజేత బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్ నిరసనలో కూర్చున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రెజ్లింగ్ ఫెడరేషన్ చాలా పవర్ ఫుల్ అని.. అందుకే నివేదిక రెడీ అవ్వడం లేదని ఆరోపించారు. ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వీళ్లంతా మరోసారి నిరసనకు దిగారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై ఎంక్వైరీ కమిటీ నివేదిక ఇచ్చే వరకు నిరసనను చేస్తామని పట్టుబట్టి కూర్చున్నారు.
బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపులకు సంబంధించి మైనర్‌తో సహా ఏడుగురు బాలికలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఇష్యూ జరిగి మూడు నెలలు గడుస్తున్నా క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి స్పందన రాలేదంటున్నారు రెజర్లు. కనీసం బ్రిజ్ భూషణ్‌పై ఎలాంటి కంప్లైంట్ కూడా రిజిస్టర్ కాలేదని ఆరోపిస్తున్నారు. అతనిపై వెంటనే పోక్సో చట్టం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. దాదాపు రెండున్నర నెలలుగా ఎదురు చూస్తున్నామని, మూడు నెలల సమయం గడిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ తమను అబద్ధాలు చెబుతున్నామని అంటున్నారని రెజ్లర్ సాక్షి మాలిక్ కన్నీరు పెట్టుకున్నారు.
తాము చెబుతున్నది అబద్ధమే అయితే మళ్లీ నిరసన ఎందుకు చేపడతామని విశేష్ పొగట్, భజరంగ్ పూనియా ప్రశ్నించారు. తమ డిమాండ్లను ప్రధాని మోదీ వినాలని, వెంటనే చర్యలు తీసుకోవాలని రెజర్లు డిమాండ్ చేశారు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించామని, అలాంటి తమకే ఇలా జరిగినప్పుడు… తమ మాటే ఎవరూ విననప్పుడు.. ఇక సామాన్య ఆడపిల్లల పరిస్థితి ఏంటని వినేశ్ పొగట్ నిలదీశారు.
అయితే.. ఈ వ్యవహారంపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, ఇతర కోచ్‌లపై వచ్చిన ఆరోపణలను పరిశీలించడానికి క్రీడా మంత్రిత్వ శాఖ ఇన్‌స్పెక్షన్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ అంశంపై నివేదికను మంత్రిత్వ శాఖకు సమర్పించే బాధ్యతను కమిటీకి అప్పగించారు. ఒలింపిక్ పతక విజేత మేరీకోమ్ పర్యవేక్షణ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు.