BigTV English

USA : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..10 మంది మృతి..

USA : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..10 మంది మృతి..

USA : అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. కాలిఫోర్నియా నగరం లాస్‌ఏంజెల్స్‌ సమీపంలోని మాంటేరీ పార్క్‌లో శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. చైనీయుల లునార్‌ న్యూఇయర్‌ ఫెస్టివల్‌ వేడుకలో ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో 10 మందికిపైగా మరణించినట్లు స్థానిక మీడియా ప్రకటించింది. మరో ఆరుగురు గాయపడినట్లు తెలుస్తోంది.


మాంటేరీ పార్క్‌ లాస్‌ ఏంజెల్స్‌కు కౌంటీ. ఇది ప్రధాన నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాల్పులు జరిగిన సమయంలో అక్కడ వేల మంది ఉన్నారు. ఓ వ్యక్తి భారీ మెషీన్‌ గన్‌తో వచ్చి కాల్పులకు పాల్పడినట్లు లాస్‌ఏంజెల్స్‌ టైమ్స్‌ పేర్కొంది. ఘటన జరిగిన వీధిలోనే సియాంగ్‌ వాన్‌ చాయి అనే వ్యక్తి బార్బెక్యూ రెస్టారెంట్‌ నిర్వహిస్తున్నాడు. రాత్రి ముగ్గురు వ్యక్తులు ప్రాణభయంతో అతడి రెస్టారెంట్లోకి వచ్చి తలుపులు వేసేశారని.. బయట ఓ వ్యక్తి గన్‌తో కాల్పులు జరుపుతున్నాడని వారు చెప్పినట్లు సియాంగ్‌ వెల్లడించాడు. ఆ సాయుధుడి వద్ద భారీగా మందుగుండు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమీపంలోని డ్యాన్సింగ్‌ క్లబ్‌ లక్ష్యంగా అతడు దాడి చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొన్నారు. అమెరికాలో తరచూ కాల్పులు ఘటనలు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఏటా వందల మంది అమాయకులు దుండగుల కాల్పులకు బలవుతున్నారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×