BigTV English

Ashok Chavan Joined in BJP: మాజీ సీఎం అశోక్‌ చవాన్‌ బీజేపీలో చేరిక.. రాజ్యసభ సీటు ఇచ్చే ఛాన్స్

Ashok Chavan Joined in BJP: మాజీ సీఎం అశోక్‌ చవాన్‌ బీజేపీలో చేరిక.. రాజ్యసభ సీటు ఇచ్చే ఛాన్స్

Former CM Ashok Chavan Joined in BJP: మహారాష్ట్రలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఆ రాష్ర్ట మాజీ సీఎం అశోక్ చవాన్ బీజేపీలో చేరారు. అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర శాసనసభ సభ్యత్వనికి సోమవారం రాజీనామా చేశారు. కాంగ్రెస్ కమిటీ చీఫ్‌ నానా పటోల్‌‌కు తన రాజీనామా లేఖను సమర్పించిన విషయం తెలిసిందే.


ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో పీసీసీ చీఫ్ నానా పటోల్‌తో విభేదాలు తలెత్తాయని తెలుస్తోంది. అందుకే ఆయన పార్టీ వీడారని చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ డిప్యూటీ సీఎం అయిన దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో అశోక్ బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆయన్ని బీజేపీ అధిష్టానం రాజ్యసభకు పంపించనుందని తెలుస్తోంది. అశోక్ చవాన్‌తో పాటు కాంగ్రెస్ కు రాజీనామా చేసిన పలువురు ఎమ్మెల్యేలు సోమవారం బీజేపీలో చేరారు.

2008లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా చవాన్ ప్రమాణ స్వీకారం చేశారు. 2010లో ఆదర్శ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో ఆయన పేరు వినిపించడంతో సీఎం పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. అశోక్ చవాన్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శంకర్‌రావు చవాన్ కుమారుడు.


Read More: ED Notice To Arvind Kejriwal : ఆరోసారి కేజ్రీవాల్ కు ఈడీ నోటీస్..

అశోక్ చవాన్ 2014, 2019 మధ్య లోక్‌సభలో తన స్వస్థలమైన కోట – నాందేడ్‌కు కూడా ప్రాతినిధ్యం వహించారు. 2015లో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన.. 2019లో నాందేడ్‌లో బీజేపీ చేతిలో ఓడిపోయారు. ఇక ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలతోపాటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు తగలడం తీరని దెబ్బగానే చెప్పవచ్చు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×