BigTV English

Salman Khan – AR Murugadoss Combo: మురుగదాస్ దర్శకత్వంలో కండల వీరుడు సల్మాన్ ఖాన్

Salman Khan – AR Murugadoss Combo: మురుగదాస్ దర్శకత్వంలో కండల వీరుడు సల్మాన్ ఖాన్
Salman Khan - AR Murugadoss movie

Salman Khan – AR Murugadoss Movie Combo: కోలీవుడ్ దర్శకుడు ఏఆర్ మురగదాస్‌‌ క్రేజే వేరు. ఒకప్పుడు ఆయన సినిమాలంటే థియేటర్ల వద్ద సందడే సందడి. ఆయన సినిమాలకు అంతటి క్రేజ్ ఉంది మరి. గజిని, స్టాలిన్, తుపాకీ, 7th సెన్స్ వంటి సినిమాలతో తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అప్పటి నుంచి ఆయన సినిమాలంటే ప్రేక్షకాభిమానులకు పిచ్చి.


అయితే మహేశ్ బాబుతో ‘స్పైడర్’ మూవీని తీశారు. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అందరి ఆశలను నిరాశ పరచింది. బాక్సాఫీసు వద్ద భారీ డిజాస్టర్‌గా మిగిలింది. ఇక ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ‘దర్భార్’ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా కూడా భారీ అంచనాలతో ప్రేక్షకాభిమానుల ముందుకు వచ్చి ఊహించని పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఇక ఈ సినిమా తర్వాత దర్శకుడు మురగదాస్ కొన్నేళ్లపాటు సినిమాల వైపు చూడలేదు. ఇప్పుడు మళ్లీ దర్శకుడు రీ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో ఓ మూవీని పట్టాలెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.


Read More: సల్మాన్ ఖాన్ సినిమాలో బతుకమ్మ సాంగ్.. తెలంగాణ ఎఫెక్ట్..

భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. సుమారు నాలుగేళ్ల తర్వాత సల్మాన్ ఖాన్‌తో ఒక సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు మురగదాస్.

గ్లోబల్ యాక్షన్ ఎంటర్‌టైన్మెంట్‌గా తెరకెక్కబోతున్న ఈ మూవీని సల్మాన్ ఖాన్ సన్నిహితుడు సాజిత్ నడియాడవాలా నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను విదేశాల్లో చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. యూరోప్‌, పోర్చుగల్ వంటి దేశాల్లో ఈ మూవీని చిత్రీకరించబోతున్నట్లు టాక్. కాగా ఈ మూవీని దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

Read More: సమంతతో రొమాన్స్‌కు సిద్ధమైన బాలీవుడ్ స్టార్ హీరో..?

అయితే ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని.. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతున్నట్లు సినీ వర్గాల సమాచారం. మరి ఈ సారి దర్శకుడు మురగదాస్ లక్ ఎలా ఉంటుందో చూడాలి. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ సినిమా తీయడానికి సిద్ధమయ్యాడంటే.. ఈ సారి కథ వేరే లెవెల్లో ఉంటుందని అంతా అనుకుంటున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×