BigTV English

Manipur: తల నరికి.. వేలాడదీసి.. మణిపూర్‌లో మరో దారుణం..

Manipur: తల నరికి.. వేలాడదీసి.. మణిపూర్‌లో మరో దారుణం..
Manipur latest incident news

Manipur latest incident news(Breaking news of today in India): మణిపూర్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కొందరు దుండగులు.. కుకి జాతికి చెందిన ఓ వ్యక్తిని చంపి, అతని తల నరికేశారు. అనంతరం ఇంటి ముందు ఫెన్సింగ్ కు వేలాడదీశారు. ఈ దృశ్యాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్​ అయ్యాయి.


మణిపూర్​ లో .. కుకి జాతికి చెందిన ఇద్దరు మహిళలపై గ్యాంగ్​ రేప్ ​తో పాటు నగ్నంగా చేసి ఊరేగించిన ఘటన మరువక ముందే.. తాజా విషయం దుమారం మళ్లీ దుమారం రేపుతోంది. ఈ ఘటన కలకలం సృష్టించిన కొన్ని రోజులకే శరీరం నుంచి తల వేరు చేసిన ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో సంచలనం సృష్టిస్తోంది.

ఈ ఘటన చూర చంద్రాపుర్ ​లో ని లమ్జా గ్రామంలో జులై 2న జరిగినట్టు తెలుస్తోంది. మృతుడి పేరు డేవిడ్​ థైక్​. వాస్తవానికి ఉద్యోగం కోసం అతను ముంబైకి వెళ్లాల్సి ఉంది. కానీ మణిపూర్​ ఘర్షణల కారణంగా అతను గ్రామంలోనే ఉండిపోయాడని స్థానికులు చెబుతున్నారు.


మణిపూర్ లో అల్లర్ల నేపథ్యంలో ఊరిలోని వారు ఒకరి తర్వాత ఒకరు కాపలా కాయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే జులై 2 తెల్లవారుజామున థైక్​ కూడా కాపలా కాశాడు. ఈ నెల 2న ఉదయం 5 గంటలకు.. ఓ గుంపు, ఆయుధాలతో థైక్​పై దాడి చేసిందని స్థానికులు చెబుతున్నారు. తుపాకీతో అతడిని కాల్చిన దుండగులు.. ఆ తర్వాత శరరం నుంచి తలను వేరు చేశారు. ఒక కన్నును పీకేశారు. అనంతరం ఆ తలను ఇంటి ముందు ఉన్న ఫెన్సింగ్ ​కు వేలాడదీశారు. అంతటితో ఆగకుండా.. తల లేని శరీరంపై అనేక మార్లు కత్తితో పొడిచారంటున్నారు స్థానికులు.

మరోవైపు చనిపోవడానికి కొంత సేపటి ముందు.. ఓ మహిళ, ఆమె ఇద్దరి బిడ్డలను థైక్​ రక్షించినట్లు తెలుస్తోంది. దుండగుల దాడి చేస్తుండగా.. ఆ ముగ్గురిని సురక్షిత ప్రాంతానికి తరలించాడు థైక్. ఆ తర్వాత తన స్నేహితుడి స్కూటర్ పై పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే థైక్ పై దాడి జరిగినట్లు ఇండిజీనియస్​ ట్రైబల్​ లీడర్స్​ ఫార్మ్​ సభ్యురాలు మేరీ వెల్లడించారు. మరోవైపు థైక్​ బంధువులు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై ఎఫ్​ఐఆర్​ దాఖలైంది. కానీ పోలీసులు ఇంకా ఈ ఘటనపై స్పందించలేదని బంధువులు చెబుతున్నారు.

అటు ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసిన ఘటనపై మణిపూర్ లో ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ జనం ఆందోళనలు చేస్తున్నారు. ఉఖ్రుల్ జిల్లాలో పెద్ద ఎత్తున మహిళలు మౌన పోరాటానికి దిగారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×