E-Paper
Advertisement

ఆర్‌ఎస్‌ఎస్ వేదికలపై కనిపించిన మీరు.. మాకు న్యాయం చేస్తారా?.. హైకోర్టులో జ‌డ్జికి కేజ్రీవాల్ సవాల్

ఆర్‌ఎస్‌ఎస్ వేదికలపై కనిపించిన మీరు.. మాకు న్యాయం చేస్తారా?..  హైకోర్టులో జ‌డ్జికి కేజ్రీవాల్ సవాల్
Advertisement

Arvind Kejriwal Delhi High Court: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ఢిల్లీ హైకోర్టులో స్వయంగా హాజరై వాదనలు వినిపించారు. ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణ కాంత శర్మపై తనకు నమ్మకం లేదని, ఆమె ఈ కేసు విచారణ నుండి తప్పుకోవాలని ఆయన కోరారు. జస్టిస్ శర్మ గతంలో ఆర్‌ఎస్‌ఎస్ (RSS) అనుబంధ సంస్థ అయిన అధ్విక్త పరిషత్ నిర్వహించిన కార్యక్రమాలకు నాలుగుసార్లు హాజరయ్యారని అన్నారు. అందుకే ఆమె నుండి నిష్పాక్షికమైన తీర్పు వస్తుందని తాను ఆశించడం లేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

“అధ్విక్త పరిషత్ అనేది బీజేపీ మరియు ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలను అనుసరించే సంస్థ. ఆ సిద్ధాంతాలను మేము బహిరంగంగా వ్యతిరేకిస్తాము. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు.” అని కేజ్రీవాల్ కోర్టులో వాదించారు. ఒక న్యాయమూర్తి ఒక నిర్దిష్ట సిద్ధాంతంతో ముడిపడి ఉన్న కార్యక్రమాలకు హాజరైనప్పుడు, దానికి పూర్తి వ్యతిరేక సిద్ధాంతం కలిగిన నిందితుడికి న్యాయం జరుగుతుందా? అనే భయం కలగడం సహజమని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో న్యాయం జరగడమే కాదు, న్యాయం జరుగుతోందనే నమ్మకం కలగడం కూడా ముఖ్యమని సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు.

Advertisement

సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు రాజకీయ పక్షపాతంతో పనిచేస్తున్నాయన్న కేజ్రీవాల్, గతంలో కోర్టులే వీటిని పంజరంలో చిలక అని అభివర్ణించాయని గుర్తు చేశారు. ఈ కేసులో కింది కోర్టు తనతో పాటు మనీష్ సిసోడియాకు క్లీన్ చిట్ ఇచ్చిందన్నారు. కానీ హైకోర్టు కేవలం సీబీఐ వాదనలు విని, తమకు నోటీసులు ఇవ్వకుండానే ఆ తీర్పును తప్పుబట్టడం తనను ఆందోళనకు గురిచేసిందని అన్నారు. “హైకోర్టు ఉత్తర్వు చూశాక నా గుండె ఆగిపోయినంత పని అయింది. సీబీఐ, ఈడీ అడిగిన ప్రతి కోరికను ఈ కోర్టు తీర్పుగా మారుస్తోంది.” అని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ సమయంలో కూడా కోర్టు అనాలోచిత‌ నిర్ణయాలు తీసుకుందని కేజ్రీవాల్ ఆరోపించారు. “మేము కేవలం అవినీతిపరులమే కాదు. అత్యంత అవినీతిపరులమని ముద్ర వేసినట్లు అనిపించింది. కానీ ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆ వ్యాఖ్యలను పక్కన పెట్టింది.” అని ఆయన పేర్కొన్నారు. కేవలం అప్రూవర్ల వాంగ్మూలాల ఆధారంగానే సీబీఐ కేసు నడుస్తోందని, త్వరగా విచారణలు ముగించాలని చూడటం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని విమర్శించారు.

Advertisement

కేజ్రీవాల్ వాదనలు విన్న జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఆయనను ప్రశంసించారు. “మీరు చాలా బాగా వాదించారు. మీరు భవిష్యత్తులో లాయర్ కూడా కావచ్చు.” అని ఆమె వ్యాఖ్యానించారు. దానికి కేజ్రీవాల్ చిరునవ్వుతో స్పందిస్తూ.. “ధన్యవాదాలు మేడమ్.. ప్రస్తుతానికి నేను చేస్తున్న పనితోనే సంతోషంగా ఉన్నాను.” అని సమాధానమిచ్చారు. కాగా, కేజ్రీవాల్ పిటిషన్‌ను సీబీఐ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఇవి నిరాధారమైన ఆరోపణలని కొట్టిపారేశారు. జస్టిస్ స్వర్ణ కాంత శర్మ తన తీర్పును రిజర్వ్ చేశారు. ఈ పిటిషన్‌పై తన నిర్ణయాన్ని కోర్టు త్వరలోనే వెల్లడించనుంది.

Read Also: ఎన్నికల్లో బయో మెట్రిక్.. సుప్రీం కోర్టులో పిటిషన్​.. సీజేఐ బెంచ్ కీలక వ్యాఖ్యలు!

Related News

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

Big Stories

Advertisement
×