BigTV English

UP Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది కూలీలు మృతి

UP Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది కూలీలు మృతి

At least 10 labourers Dead, 3 Injured in Truck-Tractor Collision In UP: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కచ్వా సరిహద్దు జిట్‌ రోడ్‌లో ఈ ప్రమాదం జరిగింది. 13 మంది కూలీలు ఓ ట్రాక్టర్‌లో వారణాసి వైపు వెళ్తుండగా.. అదుపుతప్పిన ఓ ట్రక్కు.. ట్రాక్టర్‌ను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్‌లో ఉన్న 13 మందిలో 10 మంది చనిపోగా.. మిగతా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే బనారస్‌ హిందూ యూనివర్శిటీ ట్రామా సెంటర్‌కు తరలించారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కచ్వా సరిహద్దు వద్ద అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వివరించారు. భదోడి జిల్లాలో పని ముగించుకుని 13 మంది కూలీలు ట్రాక్టర్‌లో వారణాసి వస్తుండగా.. ప్రమాదవ శాత్తు వెనక నుంచి వస్తున్న లారీ అదుపుతప్పి ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో పది మంది కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు.. భద్రతా వ్యవహారాల భేటీలో ప్రధాని ఏమన్నారు?


ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చాలా బాధాకరమని ప్రధానీ మోదీ విచారం వ్యక్తం చేశారు. అందులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ బాధను భరించే శక్తి భగవంతుడు వారికి ప్రసాదించాలని కోరుకుంటున్నా అని మోదీ తన ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×