BigTV English

PM Modi Cabinet Committee: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు.. భద్రతా వ్యవహారాల భేటీలో ప్రధాని ఏమన్నారు?

PM Modi Cabinet Committee: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు.. భద్రతా వ్యవహారాల భేటీలో ప్రధాని ఏమన్నారు?

PM Modi Cabinet Committee: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం తీవ్రమవుతుందా? దాని ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతోందా? భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఎంత? దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతోందా? ఒక్క రోజులో లక్షల కోట్ల సంపద ఆవిరయ్యిందా? కేంద్రం ముందు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలేంటి? ఈ సమస్య నుంచి గట్టెక్కడం ఎలా?


గురువారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోందని భావిస్తోంది. దీన్ని నుంచి ఎలా గట్టెక్కాలని చర్చించారు.

రష్యా-ఆఫ్ఘనిస్తాన్ మధ్య వ్యవహరించినట్టుగానే చర్చలు, సంప్రదింపుల ద్వారా శాంతియుతంగా సమస్యను పరిష్కారం లభిస్తుందని పశ్చిమాసియా దేశాలను కోరుతోంది భారత్. కానీ అక్కడ పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. ఇరాక్, లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన దాడులు జరుగుతున్నాయి.  ఆయా దేశాలకు వెళ్లడం మానుకోవాలని తమ ప్రజలను వివిధ దేశాలు కోరాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.


యుద్ధం కారణంగా ఆయా దేశాలతో వాణిజ్యం, నేవిగేషన్, ఆ మార్గంలో జరిగే సరకు రవాణా, ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా ప్రభావితం పడుతుందని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ అంచనా వేసింది. ఎర్ర సముద్రం మీదుగా గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ద్వారా జరిగే సరకు రవాణాపై తీవ్ర ప్రభావం పడుతుందని భావిస్తోంది.

ALSO READ: మధ్యప్రదేశ్ రత్లామ్ లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్

ఈ మార్గంలో జరిగే సరకు రవాణా నౌకలపై దాడులకు తెగబడుతున్నారు యెమెన్ హౌతీ ఉగ్రవాదులు. కొద్దిరోజులుగా మరింత తీవ్రమైంది. వారికి మద్ధతుగా నిలుస్తున్నాయి లెబనాన్ హెజ్బొల్లా, ఇరాన్ వంటి దేశాలు. ఈ పరిస్థితుల్లో సరకు రవాణా ఖర్చులు పెరిగినట్టు అంచనా వేస్తోంది. వార్ నేపథ్యంలో కార్గో నౌకలపై మరింత ప్రభావితం చూపనుంది.

భారత ఎగుమతుల్లో ఎర్రసముద్రం, సూయజ్ కెనాల్ మీదుగా 50 శాతం వాణిజ్యం (రూ. 18 లక్షల కోట్లు) జరుగుతోంది. అందులో భారత దిగుమతులపై 30 శాతం ప్రభావం (రూ. 17 లక్షల కోట్లు) పడనుంది. దీని ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై పడుతోంది.

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ప్రభావం భారత్ స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది.. చూపుతోంది. గురువారం ఒక్క రోజు లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది. ఈ వాతావరణం కొనసాగితే ప్రపంచ పరిణామాలతో ప్రభావితం కానుంది భారత ఆర్థిక వ్యవస్థ. అంతేకాదు వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి. ఆయా దేశాల్లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలన చేస్తోంది భారత్.

Related News

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Big Stories

×