BigTV English

Ayodhya Ram Mandir : రామ్ లల్లా ప్రాణప్రతిష్ట.. ఏ సమయానికి ఏం జరగనుందంటే?

Ayodhya Ram Mandir : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో మరికొద్ది సేపట్లో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన 16 ఆచారాలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు అయోధ్యలో ఏడంచెల భద్రత కల్పించారు. ఎస్పీజీ, ఎన్‌ఎస్‌జీ కమాండోలను అయోధ్య అంతటా మోహరించారు. డ్రోన్‌లతో అయోధ్య అంతటా నిఘా కొనసాగుతోంది. నేడు అయోధ్యకు మొత్తం 7,140 మంది అతిథులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ రోజు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠతో పాటు జరిగే కార్యక్రమాల వివరాలివే..

దేవకినందన్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీరామ కథా పారాయణం నిర్వహిస్తారు. అనంతరం అయోద్య లో ప్రముఖంగా వెలుగొందుతున్న వంద ప్రదేశాలలో ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు సాంస్కృతిక ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తర్వాత యూపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1500 మంది జానపద నృత్య కళాకారుల ‍ప్రదర్శన ఉంటుంది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రాంతీయ సాంస్కృతిక కేంద్రాలకు చెందిన 200 మంది కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు.

అయోద్యలో ఉన్న రామకథా పార్కులో సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు రాంలీలా ప్రదర్శన నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 నుండి 7 గంటల వరకు శ్రీరామునికి సరయూ హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. రాత్రి 7 నుంచి 7.30 వరకు రామ్ కి పైడిపై ప్రొజెక్షన్ షో కార్యక్రమం ఉంటుంది. రామకథా పార్కులో రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాటేకర్ సిస్టర్స్ సారధ్యంలో రామకథా గానం ఉంటుంది. తులసీ ఉద్యానవనంలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు శర్మ బృందంచే భజన కార్యక్రమం నిర్వహిస్తారు. రాత్రి 7.45 నుండి 7.55 వరకు రామ్ కీ పైడి వద్ద బాణసంచా కాల్చడ జరుగుతుంది. కన్హయ్య మిట్టల్ సారధ్యంలో రామకథా పార్క్ వద్ద రాత్రి 8 నుండి 9 గంటల వరకు భక్తి సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు తులసి ఉద్యానవనంలో రఘువీర పద్మశ్రీ మాలినీ అవస్థి సారధ్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×