Bengaluru: ఆవేశం.. ఆగ్రహం.. కారణంగా తన ఫ్యామిలీని ఊచకోత కోశాడు ఇంటి యజమాని. ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా ఏడుగుర్ని హత్య చేశాడు. సంచలనం రేపిన ఈ ఘటన బెంగుళూరులో బయటపడింది. ఈ కేసులో నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసలు ఘటన ఎలా జరిగింది?
బెంగళూరు సిటీలో ఒకే కుటుంబంలో ఏడుగురు హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇందూశేఖర్ అలియాస్ శేఖర్ అనే క్యాబ్ డ్రైవర్.. భార్యతోపాటు వారి ఫ్యామిలీకి చెందిన ఏడుగుర్ని హత్య చేశాడు. చివరకు నిందితుడ్ని పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బెంగుళూరు సిటీలోని రాజాజీనగర్‌లోని బాష్యం సర్కిల్ సమీపంలో శేఖర్ ఫ్యామిలీ నివాసం ఉంటోంది.
శేఖర్ దంపతులకు పెళ్లై సుమారు 20 ఏళ్లు అయ్యింది. సునీత తన పుట్టింటికి వెళ్లే విషయంలో తరచుగా భర్తతో గొడవలు జరిగేవి. రాను రాను గొడవలు తీవ్రమయ్యేవి. వాటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఫ్యామిలీ సభ్యలు ఏ మాత్రం సహకరించేవారు కాదు. పైగా సునీతకు తల్లి, సోదరుల నుండి మద్దతు ఉండేది. దీన్ని చూసి పగ పెంచుకున్నాడు శేఖర్. భార్యని తనకు దూరంగా పెడుతున్నారని భావించాడు. ఈ క్రమంలో భార్య ఫ్యామిలీని లక్ష్యంగా చేసుకున్నాడు.
కొన్ని రోజులుగా కుటుంబ సభ్యులను హత్యలు చేసి వారి మృతదేహాలను ఎవరికీ తెలియకుండా ఉండేందుకు నంది హిల్స్ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాడు. అక్కడి నుంచి మనసులోని వేసుకున్న ప్లాన్‌ను ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాడు. బాధితులను విడతల వారీగా తన ఇంటికి రప్పించి హత్య చేశాడు శేఖర్. మృతుల్లో శేఖర్ భార్య సునీత, అత్త రూపవతి, బావమరిది శివకుమార్, శంకర్, వదినలు దివ్య, నళిని, శంకర్ కుమారుడు ఏడేళ్ల పునీత్ కూడా ఉన్నాడు. శేఖర్.. తన భార్య కుటుంబంపై ఉన్న పగతో వారిని లక్ష్యంగా చేసుకున్నాడు.
తొలుత శేఖర్.. భార్య సునీతను రోలుతో కొట్టి చంపి ఆమె మృతదేహాన్ని గుడ్డలో చుట్టి చిక్కబళ్లాపూర్ జిల్లాలోని నంది హిల్స్ సమీపంలో పడేశాడు. ఆ తర్వాత ఆమె మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి అనుమానం రాకుండా ఉండేందుకు ఊరు వెళ్లిందని ఇరుగుపొరుగు వారికి చెప్పాడు. మరుసటి రోజు శేఖర్ బావమరుదులు శివకుమార్, శంకర్‌లను తన ఇంటికి విందుకు ఆహ్వానించి లేపేశాడు. బావమరిది భార్యలు దివ్య, నళిని అత్త రూపవతి, శంకర్ ఏడేళ్ల కొడుకును హత్య చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
ALSO READ: ఇండియన్ బ్యాంక్‌లో 1,500 జాబ్స్.. డిగ్రీ ఉంటే చాలు..వెంటనే అప్లై చేయండి
హత్యలకు ముందు వారిని మత్తులోకి దించడానికి ఆహారంలో ఏదో మత్తు కలిపి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఏడుగురి మృతదేహాలను నంది హిల్స్ పరిసర ప్రాంతాల్లో వేర్వేరు చోట్ల పడేశాడు. రాజాజీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి, హత్యల వెనుక కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యల వెనుక వైవాహిక కలహాలు కారణమై ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు.