Bigg Boss 10:జబర్దస్త్ కామెడీ షోలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు నరేష్. తనదైన కామెడీతో, పంచ్ డైలాగులతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. బిగ్ బాస్ సీజన్ 10లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక్కడ తనదైన పెర్ఫార్మన్స్ తో ఎటువంటి నెగెటివిటీని మూటగట్టుకోకుండా తనదైన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. అలాంటి నరేష్ మరోసారి మానవత్వం చాటుకొని అందరి హృదయాలను దోచుకున్నారు. ముఖేష్ కోసం ఏకంగా త్యాగానికి కూడా సిద్ధపడటం చూసి నరేష్ పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే.. 61వ రోజుకు సంబంధించిన విడుదల చేసిన మొదటి ప్రోమోని నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ తమ కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం కోసం ఎంతగా కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పలు టాస్కులు గెలిచి తమకు నచ్చని వారిపై రివేంజ్ తీర్చుకుంటూ వారు తమ కుటుంబ సభ్యులను కలుసుకోకుండా చేసి వికృత ఆనందం పొందారు అనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సమయంలో తాజాగా ఆఖరి రౌండ్ లో భాగంగా.. రామకృష్ణ , అమన్ , ముఖేష్, వర్షిణి.. మీ నలుగురికి నేను ఇస్తున్న చాలెంజ్.. బట్ లాస్ట్ ఛాన్స్ అంటూ వారికి సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ అవకాశాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో.. వారు తమ ఫ్యామిలీని కలుసుకునే అవకాశాన్ని దక్కించుకుంటారు అంటూ టాస్క్ నిర్వహించారు. టాస్క్ కి నరేష్ సంచాలక్ గా వ్యవహరించారు.
ఒకరు స్టాండ్ పట్టుకుంటే.. మరొకరు దానిని ఆపోజిట్ లో బ్యాలెన్స్ చేయాలి. ఒకసారి నాలుగు బ్లాకులు మాత్రమే పెట్టాలి అని ఒక టాస్క్ నిర్వహించారు బిగ్ బాస్. అమన్ – రామకృష్ణ జంటగా ఆడగా, ముఖేష్ – వర్షిని జంటగా ఆడారు.. కింద నుంచి పై వరకు సరైన క్రమంలో పెట్టి హౌస్ వచ్చేలా పజిల్ ని పూర్తి చేయాలి అని టాస్క్ నిర్వహించారు బిగ్బాస్. ఇక ముఖేష్ తన ఫ్యామిలీని కలవడం కోసం ఎంత కష్టపడ్డారో మనకు ఈ టాస్క్ లో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ టాస్కులో ముకేష్ మొదట టాస్క్ పూర్తి చేశాడు. సంచాలక్ గా ఉన్న నరేష్ కౌంట్ చేస్తుండగా ఫోర్ అంటుండగానే అది కింద పడిపోయింది. కానీ తాను వెంటనే 5 చెప్పేసానని నీతూ మాస్టర్ , శ్వేతలతో వాదించాడు. తర్వాత రామకృష్ణ తన పజిల్ పూర్తి చేసి ఏకంగా 1 టూ 15 వరకు నంబర్స్ కౌంట్ చేశారు. ఆఖరులో తన పజిల్ పడిపోయింది. ఇది గేమ్ అంటే అంటూ గట్టిగా అరిచాడు.
also read:హాస్పిటల్లో చేరిన రజినీకాంత్ సోదరుడు.. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే?
కానీ నరేష్ మాత్రం ముఖేష్ కి సపోర్ట్ ఇస్తూ 5 అన్న తర్వాతే కింద పడింది. శనివారం రోజు ఏదైనా తప్పయితే నేను తీసుకుంటాను. నాది తప్పయితే నా ఫ్యామిలీని కూడా నేను కలవకుండా వదులుకుంటాను. ఇందులో ముఖేష్ విన్ అయ్యాడు. అతను తన ఫ్యామిలీ ని కలుసుకోవాలి అంటూ నరేష్ చేసిన ఈ త్యాగం సోషల్ మీడియాలో ఆయన పై ప్రశంసలు కురిపించేలా చేస్తోంది.