Romantic Emotional Drama: ప్రేమ ఎంత అందంగా ఉంటుందో, అపార్థాలు వచ్చినప్పుడు అంతే భయంకరంగా మారుతుంది. మోడరన్ డే రిలేషన్‌షిప్స్ లో ఉండే ఈగో క్లాషెస్, ఎమోషనల్ పెయిన్‌ని హార్ట్ టచింగ్ గా చూపెట్టిన లేటెస్ట్ కొలీవుడ్ రొమాంటిక్ డ్రామా మూవీ ‘Nooru Kodi Vaanavil’. వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శశి (బిచ్చగాడు ఫేమ్) మేకింగ్ లో వచ్చిన ఈ మూవీ థియేటర్ల లోకి రాకుండా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి మొగ్గు చూపింది. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాలను ఇష్టపడే వారికి ఇదొక పర్ఫెక్ట్ వీకెండ్ వాచ్.
వినో (హరీష్ కళ్యాణ్) అనే ఒక యంగ్ అండ్ టాలెంటెడ్ టెలివిజన్ యాంకర్ కి గోవాలో ఒక పెద్ద మీడియా ఛానల్ లో డ్రీమ్ జాబ్ దొరుకుతుంది. తన కెరీర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ఒక స్పెషల్ షో కోసం లీడ్ క్యారెక్టర్ ని వెతికే ప్రాసెస్ లో అతనికి ఫెన్నీ (సిద్ధి ఇద్నాని) పరిచయం అవుతుంది. ఫెన్నీ చాలా ఎనర్జిటిక్ ఓపెన్ మైండెడ్ అమ్మాయి. వినో ప్రొఫెషనల్ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె, కొద్దిరోజుల్లోనే అతని పర్సనల్ లైఫ్ లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ గా మారిపోతుంది. ఇద్దరి మధ్య ఒక బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ స్టార్ట్ అవుతుంది.
కానీ ఇక్కడే కథలోకి ట్విస్ట్ వస్తుంది. వారిద్దరి ఆలోచనలు, లైఫ్ పట్ల ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ వేరుగా ఉండటంతో చిన్న చిన్న విషయాల్లో అపార్థాలు మొదలవుతాయి. ఆ అపార్థాలు కాస్తా పెద్ద పెను తుఫాన్ లా మారి వారి రిలేషన్‌షిప్‌ని ముక్కలు చేస్తాయి. ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్న ఈ ఇద్దరూ, కెరీర్ మరియు పర్సనల్ లైఫ్ మధ్య ఎలాంటి కఠినమైన డెసిషన్స్ తీసుకున్నారు? చివరకు ఈ ఎమోషనల్ రొమాంటిక్ జర్నీ ఎలా ఎండ్ అయింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
‘నూరు కోడి వానవిల్’ చిత్రంలో హరీష్ కళ్యాణ్ వినో పాత్రలో, సిద్ధి ఇద్నాని ఫెన్నీ పాత్రలో నటించారు. కోవై సరళ, తంబి రామయ్య, చిన్ని జయంత్, సంపత్, ఎం. రినిల్, వీజే పార్వతి తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు శశి కథ, దర్శకత్వం అందించగా, సిద్ధు కుమార్ సంగీతం సమకూర్చారు. బాలాజీ కాపా, అరుణ్ అరుణాచలం నిర్మించారు. 2019లోనే ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటికీ, వివిధ కారణాలతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది. చివరకు 2026 నవంబర్ 6న ZEE5లో నేరుగా డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చింది. ఇది ఒరిజినల్ తమిళ వర్షన్‌తో పాటు తెలుగు, హిందీ ఆడియో డబ్బింగ్ ఆప్షన్స్ కూడా జీ5 లో అందుబాటులో ఉన్నాయి.