E-Paper
Advertisement

ఇండియన్ బ్యాంక్‌లో 1,500 జాబ్స్.. డిగ్రీ ఉంటే చాలు..వెంటనే అప్లై చేయండి

ఇండియన్ బ్యాంక్‌లో 1,500 జాబ్స్.. డిగ్రీ ఉంటే చాలు..వెంటనే అప్లై చేయండి
Advertisement

Indian Bank Jobs| డిగ్రీ పూర్తి చేసి బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు ఇండియన్ బ్యాంక్ మంచి అవకాశం కల్పిస్తోంది. 2026 సంవత్సరానికి సంబంధించి 1,500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు నవంబర్ 25, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఏడాది పాటు అప్రెంటిస్ ట్రైనింగ్ (శిక్షణ) ఇస్తారు. ఈ ఉద్యోగాలకు ఎవరు అర్హులు? వయోపరిమితి ఎంత? ఎలా దరఖాస్తు చేసుకోవా లి? వంటి వివరాలు తెలుసుకుందాం.

ఇండియన్ బ్యాంక్ అప్రెంటిస్ నోటిఫికేషన్

ఇండియన్ బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్ indianbank.bank.in లో అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 1,500 పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ పూర్తిగా చదవాలి. ఇందులో అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు నిబంధనలు, ఇతర ముఖ్యమైన వివరాలు ఉంటాయి.

డిగ్రీ అర్హత తప్పనిసరి

Advertisement

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అయితే, ఏప్రిల్ 1, 2022 నుంచి నవంబర్ 1, 2026 మధ్య డిగ్రీ ఫలితాలు ప్రకటించిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.

వయోపరిమితి

నవంబర్ 1, 2026 నాటికి అభ్యర్థుల వయసు కనీసం 20 ఏళ్లు ఉండాలి. గరిష్ఠ వయసు 28 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు చేయడానికి NATS రిజిస్ట్రేషన్ తప్పనిసరి

Advertisement

అభ్యర్థులు నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) పోర్టల్‌లో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. తమ ప్రొఫైల్‌లో విద్యార్హతలు, ఇతర వివరాలను పూర్తిగా నమోదు చేయాలి. అప్లికేషన్ సమర్పించే ముందు రిజిస్ట్రేషన్ వివరాలు సరిచూసుకోవాలి.

ఎంపికైన వారికి ఏడాది పాటు శిక్షణ

ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్ ట్రైనింగ్ అందిస్తారు. అభ్యర్థులు తమకు నచ్చిన రాష్ట్రంలో శిక్షణ పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే, ఇది శాశ్వత ఉద్యోగానికి హామీ కాదని గుర్తుంచుకోవాలి. కానీ ట్రైనింగ్ సమయంలో మంచి పనితీరు ఆధారంగా అవకాశాలు ఉంటాయి.

Also Read: నెలకు రూ.24 లక్షల జీతం, క్రెడిట్ స్కోర్ 750.. అయినా హోమ్ లోన్ తిరస్కరించిన బ్యాంక్?

ఎలా దరఖాస్తు చేయాలి?

ముందుగా indianbank.bank.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్‌ ఓపెన్ చేయండి. అర్హతలు, దరఖాస్తు సూచనలను పూర్తిగా చదవాలి. NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. అధికారిక అప్లికేషన్ లింక్ ద్వారా దరఖాస్తు ప్రారంభించాలి. వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి. అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేసి అప్లికేషన్ సమర్పించాలి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ కాపీని భద్రపరచుకోవాలి.

Also Read: రైల్లో మీ వస్తువులు లేదా లగేజీ మర్చిపోతే ఏం చేయాలి? తిరిగి పొందడానికి వెంటనే ఇలా చేయండి

ముఖ్యమైన వివరాలు:

  • మొత్తం ఖాళీలు: 1,500
  • చివరి దరఖాస్తు తేదీ: నవంబర్ 25, 2026
  • వయసు లెక్కించే తేదీ: నవంబర్ 1, 2026
  • శిక్షణ కాలం: ఒక సంవత్సరం
  • అధికారిక వెబ్‌సైట్: indianbank.bank.in

అభ్యర్థులు చివరి తేదీలోగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. ఎంపిక విధానం, స్టైపెండ్, పరీక్ష తేదీల కోసం అధికారిక వెబ్‌సైట్‌ పరిశీలించాలి.

Tags

Related News

ఆర్టీసీ బస్సుని ఢీ కొట్టిన వ్యాన్.. స్పాట్‌లో 50 మంది, తమిళనాడులో ఘోర ప్రమాదం

షాకింగ్ ఘటన.. భార్యని కుర్చీకి కట్టేసి తగలబెట్టిన భర్త, అసలు మేటర్ అదే!

18 సవర్ల బంగారం.. బిడ్డ, భర్తతో కిడ్నాప్ డ్రామా.. ‘లేడీ డాన్’ ప్లాన్ రివర్స్!

ఐదు ఏనుగులు, రూ.6 కోట్లు.. ఈ ఘటనతో బీజేపీకి లింకేమిటీ?

దేశంలో అశాంతికి కుట్ర.. సీజేపీకి పాక్ నిధులు.. కేంద్రమంత్రి సంచలన ఆరోపణలు!

‘రోడ్ల మీద కాదు.. పార్లమెంట్‌లో చూసుకుందాం’.. రాహుల్ సవాల్‌పై అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్!

ఢిల్లీలో కూలిన మూడు అంతస్థుల భవనం.. స్పాట్‌లో ఇద్దరు మృతి, శిథిలాల కింద మరో రెండు డజన్ల మంది

Big Stories

Advertisement
×