E-Paper
Advertisement

లడఖ్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్.. వామ్మో.. అన్ని మీటర్ల పైనా..

లడఖ్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్.. వామ్మో.. అన్ని మీటర్ల పైనా..
Advertisement

World’s Highest Railway Station: భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల్లో ఒకటిగా బిలాస్‌పూర్–మనాలి–లేహ్ రైల్వే లైన్ నిలవబోతోంది. హిమాలయ పర్వత ప్రాంతాల మీదుగా సాగే ఈ రైల్వే మార్గాన్ని సుమారు రూ.1.31 లక్షల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా లడఖ్‌ లో సముద్ర మట్టానికి 17,244 అడుగుల ఎత్తులో రైల్వే స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న రైల్వే స్టేషన్‌గా ఇది రికార్డు సృష్టించనుంది.

చైనా రికార్డును అధిగమించే అవకాశం

ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న రైల్వే స్టేషన్‌గా చైనాలోని తంగులా స్టేషన్ గుర్తింపు పొందింది. క్వింగ్‌హై–టిబెట్ రైల్వే మార్గంలో ఉన్న ఈ స్టేషన్ సముద్ర మట్టానికి 5,068 మీటర్ల ఎత్తులో ఉంది. అయితే, భారత్ ప్రతిపాదిస్తున్న బిలాస్‌పూర్–మనాలి–లేహ్ మార్గంలో తంగ్లాంగ్ లా కనుమ కింద సుమారు 5,256 మీటర్ల ఎత్తులో స్టేషన్ నిర్మించాలని భావిస్తున్నారు. ఇది తంగులా స్టేషన్ కంటే దాదాపు 188 మీటర్లు ఎక్కువ.

489 కిలోమీటర్ల పొడవైన రైల్వే మార్గం

Advertisement

ఈ రైల్వే కారిడార్ మొత్తం 489 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ నుంచి లడఖ్‌లోని లేహ్ వరకు ఈ మార్గం విస్తరించనుంది. ఇందులో సుందర్‌నగర్, మండి, మనాలి, కీలాంగ్, సర్చు, పాంగ్, రుమ్ట్సే, ఉప్షి లాంటి ప్రాంతాల్లో స్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ మార్గంలో దాదాపు 270 కిలోమీటర్ల మేర సొరంగాలు నిర్మించాల్సి ఉంటుంది. హిమాలయాల్లోని కఠినమైన భౌగోళిక పరిస్థితులు, భూకంప ముప్పు, హిమపాతం, తీవ్రమైన చలి లాంటి అంశాలు నిర్మాణానికి పెద్ద సవాలుగా మారనున్నాయి.

రూ.1.31 లక్షల కోట్ల భారీ వ్యయం

ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.1.31 లక్షల కోట్లు. దీంతో దేశంలోనే అత్యంత ఖరీదైన రైల్వే ప్రాజెక్టుల్లో ఇదీ ఒకటిగా నిలవనుంది. ప్రస్తుతం లడఖ్‌ కు వెళ్లాలంటే ఎక్కువగా రోడ్డు మార్గాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కలగనుంది.

సైన్యానికి, పర్యాటక రంగానికి మరింత లాభం

Advertisement

ఈ రైల్వే మార్గం కేవలం ప్రయాణికుల రాకపోకలకే కాకుండా వ్యూహాత్మకంగానూ కీలకంగా భావిస్తున్నారు. సరిహద్దు ప్రాంతమైన లడఖ్‌ కు సైనిక సిబ్బంది, ఫ్యూయల్, యుద్ధసామాగ్రి, నిత్యావసర వస్తువులను వేగంగా తరలించేందుకు ఈ మార్గం ఉపయోగపడనుంది. అలాగే, హిమాచల్ ప్రదేశ్, లేహ్ మధ్య రాకపోకలు సులభమైతే పర్యాటక రంగానికి, స్థానిక వ్యాపారాలకు కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి.

నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభం?   

ప్రస్తుతం ఈ రైల్వే లైన్ ప్రణాళిక దశలోనే ఉంది. రైల్వే శాఖ సర్వే పూర్తి చేసి, DPR సిద్ధం చేసినట్లు సమాచారం. పెట్టుబడి, సాంకేతిక పరిశీలనలు, పర్యావరణ అనుమతులు పూర్తయిన తర్వాతే ప్రాజెక్టు ముందడుగు పడే అవకాశం ఉంది.

Read Also: టాయ్ ట్రైన్‌కు హైడ్రోజన్ ఇంజిన్.. 120 ఏళ్ల రైల్వేకు కొత్త టెక్నాలజీ!

Tags

Related News

టాయ్ ట్రైన్‌కు హైడ్రోజన్ ఇంజిన్.. 120 ఏళ్ల రైల్వేకు కొత్త టెక్నాలజీ!

చెక్ ఇన్ ఆలస్యంతో విమానం మిస్.. ఎయిర్‌లైన్‌కు భారీ జరిమానా!

బెంగళూరు-గోవా వందే భారత్ వెరీ స్లో.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

PNR అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? దానిలోని అంకెలు దేనికి సంకేతం?

రైలులో విమానం రూల్.. ఈ తప్పు అస్సలు చేయెుద్దు.. లేదంటే టికెట్ ఉన్నా 6 రెట్లు ఫైన్ కట్టాల్సిందే!

ఆర్టీసీ సంచలన నిర్ణయం.. తలుపులు మూశాకే బస్సు స్టార్ట్.. ప్రవళిక ఘటనతో మేల్కొలుపు!

రైల్లో మీ వస్తువులు లేదా లగేజీ మర్చిపోతే ఏం చేయాలి? తిరిగి పొందడానికి వెంటనే ఇలా చేయండి

Big Stories

Advertisement
×