BigTV English

Dhruv Rathee: యూట్యూబర్ ధృవ్ రాఠీకి ఢిల్లీ కోర్టు సమన్లు.. పరువు నష్టం దావా వేసిన బిజేపీ నాయకుడు

Dhruv Rathee: యూట్యూబర్ ధృవ్ రాఠీకి ఢిల్లీ కోర్టు సమన్లు.. పరువు నష్టం దావా వేసిన బిజేపీ నాయకుడు

Dhruv Rathee: ప్రముఖ యూట్యూబర్ ధృవ్ రాఠీకి ఢిల్లీ కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. బిజేపీ నాయకుడు సురేశ్ కరమ్‌షీ నఖుఆ తనను హింసను ప్రేరేంపించే, అసభ్య పదజాలం ఉపయోగించే వ్యక్తిగా తన ఛానెల్ వీడియోలో పేర్కొన్నాడని ఆరోపిస్తూ.. ధృవ్ రాఠీపై ఆయన పరువు నష్టం దావా కేసు వేశాడు. ఢిల్లీ లోని జిల్లా కోర్టు ఈ కేసుని ఆగస్టు 6న విచారణ చేయనుంది.


‘గోదీ యూట్యబర్స్ నా సమాధానం, ఎల్విష్ యాదవ్’ అనే పేరుతో ధృవ్ రాఠీ తన యూట్యూబ్ ఛానెల్ లో జూలై 7, 2024 న ఓ వీడియో అప్ లోడ్ చేశాడు. ”ఈ వీడియోలో తనను హింసను ప్రేరేంపించే వ్యక్తి అని, ఇతరులతో నేను అసభ్య పదజాలంతో మాట్లాడుతానని వారిపై దాడి చేస్తానని ధృవ్ రాఠీ చెప్పాడు. దీనికి ఎలాంటి ఆధారాలు లేదు. కేవలం తన పేరు, ప్రతిష్ఠను దెబ్బతీయడానికే అతను ఇలా చెప్పాడు,” అని బిజేపీ నాయకుడు తన పిటీషన్ లో పేర్కొన్నాడు.

Also Read: అరుదైన కేసుల్లోనే బెయిల్‌ ఆర్డర్‌పై స్టే ఇవ్వాలి: సుప్రీంకోర్టు


ధృవ్ రాఠీ వీడియోలు కోట్ల మంది చూస్తారని.. వీడియోల్లో అతను చెప్పిన రెచ్చగొట్టే విషయాలు.. సోషల్ మీడియాలో కార్చిచ్చులా వేగంగా వ్యాపిస్తాయని.. దాని వల్ల తను పరువు భంగం కలుగుతోందని సురేష్ వాదన. తన వీడియాల ద్వారా అబద్ధలు ప్రచారం చేయడమే కాకుండా.. ధృవ్ రాఠీ హింసను ప్రేరేపిస్తున్నాడని సురేష్ తీవ్ర ఆరోపణలు చేశాడు.

ధృవ్ రాఠీ తన వీడియోల్లో చెప్పే విషయాలను చాలా మంది ఖండిస్తున్నారని.. అయినా అతను ఉద్దేశ పూర్వకంగాన తనపై ఆధారంలేని ఆరోపణలు చేస్తున్నాడని బిజేపీ నాయకుడు సురేష్ కోర్టుకు విన్నవించుకున్నాడు. సమాజంలో ఎంతో కష్టపడి సంపాదించుకున్న తన పరువు, వ్యక్తిత్వాన్ని దెబ్బతీయలనే ఇదంతా కుట్ర ప్రకారం.. ధృవ్ రాఠీ వెనుకు ఉండి ఎవరో చేస్తున్నారని చెప్పాడు. ప్రజల్లో తన పట్ల అనుమానం కలిగించే విధంగా వ్యాఖ్యలు ధృవ్ రాఠీపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తన పిటీవషన్ లో కోరాడు.

Also Read: ట్రంప్ హత్యాయత్నం.. భద్రతా వైఫల్యం విమర్శలతో అమెరికా సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ రాజీనామా!

 

Related News

Vice President: భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్..

Vice President Election: ఉప రాష్ట్రపతి ఎన్నిక.. రాధాకృష్ణన్ Vs సుదర్శన్ రెడ్డి

Social Media Ban: నేపాల్‌లో హింసాత్మకంగా యువత నిరసనలు.. కాల్పుల్లో 20 మంది మృతి

Amruta Fadnavis: బీచ్‌‌ను శుభ్రం చేసిన సీఎం భార్య.. ఆమె డ్రెస్ చూసి నోరెళ్లబెట్టిన జనం

NDA Cheap Tricks: ఆహా.. బీహార్ అంటే కేంద్రానికి ఎంత ప్రేమ.. ఇవేం చీప్ ట్రిక్స్?

Drugs Case: చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు

×