BigTV English

2024 Nissan X-Trail: నిస్సాన్ కొత్త ఎక్స్ ట్రైల్ ఎస్యూవీ ఫుల్ డీటెయిల్స్.. గంటకు 200 కి.మీ వేగంతో.. !

2024 Nissan X-Trail: నిస్సాన్ కొత్త ఎక్స్ ట్రైల్ ఎస్యూవీ ఫుల్ డీటెయిల్స్.. గంటకు 200 కి.మీ వేగంతో.. !
Advertisement

2024 Nissan X-Trail Full Review: 2024 నిస్సాన్ ఎక్స్ ట్రైల్ 4th gen ఎస్యూవీ తాజాగా దేశీయ మార్కెట్‌లో అడుగుపెట్టింది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఎక్స్ ట్రైల్ కంటె ఈ కొత్త మోడల్‌ భారీ మార్పులతో మార్కెట్‌లోకి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 2024 Nissan X-Trail 1.5 లీటర్ వేరియబుల్ జామెట్రీ టర్బో, మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులోకి వచ్చింది.ఇది ఒకే డ్రైవ్‌ట్రెయిన్ ఆప్షన్‌ను కలిగి ఉంటుంది. కాగా దీని ఇంజన్ 4800 ఆర్‌పిఎమ్ వద్ద 161 బిహెచ్‌పి.. అలాగే 2800, 3600 ఆర్‌పిఎమ్ వద్ద 300 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.


12వి మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ ద్వారా దీని ఇంజన్ పవర్‌ను పొందుతుంది. దీంతో దీని మొత్తం పవర్‌ని ఎక్స్ ట్రైల్ ఫ్రంట్ వీల్‌లకు సివిటి ద్వారా సరఫరా చేస్తుంది. దీని కారణంగా ఇది ఫాస్ట్ రన్నింగ్ ఎస్యూవీగా నిలిచింది. కాగా ఈ 2024 Nissan X-Trail కారు కేవలం 9.6 సెకన్లలో 0 నుంచి 100 km/h వేగంతో పరుగులు పెడుతుంది. ఈ కొత్త ఎక్స్ ట్రైల్ గంటకు 200 కి.మీ వేగంతో దూసుకుపోతుంది.

Also Read: ప్రాణం ముఖ్యం బిగులు.. 6 ఎయిర్‌బ్యాగ్‌లతో చౌకైన SUVలు..!


అయితే ఈ కొత్త 2024 Nissan X-Trail మైలేజీ గురించి అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇది ఎంత మేర మైలేజీ ఇస్తుందని చూస్తున్నారు. అయితే ఈ 2024 Nissan X-Trail ఒక లీటర్‌కి 13.7 కి.మీ మైలేజీని అందిస్తుందని చెప్పబడింది. ఇందులో 585 లీటర్ బూట్ స్పేస్ ఉంది. అలాగే లోపల ఉండే రెండు, మూడవ వరుస సీట్లను మడతపెట్టుకోవచ్చు.

దీని కారణంగా మరి స్పేస్‌ని పొందవచ్చు. ఇది 4680 మిమీ పొడవు, 1840 మిమీ వెడల్పు, 1725 మిమీ ఎత్తు, 2705 మిమీ వీల్‌బేస్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త 2024 Nissan X-Trailతో కంపెనీ ఎస్యూవీ విభాగంలో కింగ్ మేకర్‌గా తన సత్తా చాటాలని భావిస్తోంది. ఒక మంచి ఎస్యూవీ కోసం ఎదురుచూస్తున్న వాహన ప్రియులకు ఇది బెస్ట్‌గా చెప్పుకోవచ్చు.

Tags

Related News

Hyderabad Postal: హైదరాబాద్ లో 24×7 స్పీడ్ పోస్ట్ బుకింగ్.. నైట్ షిఫ్ట్ ప్రారంభించిన పోస్టల్ శాఖ

BSNL Diwali Offer: బీఎస్ఎన్ఎల్ దీపావళి బొనాంజా ఆఫర్.. రూ.1కే కొత్త కనెక్షన్.. ఉచిత సిమ్, రోజుకు 2 జీబీ డేటా

EPFO New Rules: PF ఖాతాల నుంచి నగదు ఉపసంహరణ.. ఈ కొత్త నియమాలు మీకు తెలుసా?

Diwali Gold: రూ.41 వేలకే 10 గ్రాముల బంగారం కొనేయండి.. జస్ట్ ఇలా చేస్తే చాలు

LIC BIMA Lakshmi: తక్కువ ప్రీమియంతో ఎల్ఐసీ కొత్త పాలసీ.. బీమా లక్ష్మి ప్లాన్ వివరాలు ఇలా!

Digital Gold Investments: డిజిటల్ బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చా? లాభాలు ఏమిటీ?

JioMart Offer on Rice Bag: జియోమార్ట్ అదిరే ఆఫర్.. 26 కిలోల బియ్యం మరీ ఇంత తక్కువ ధరకా?

Amazon Jobs: ఈ కంపెనీలో జాబ్ చేస్తున్నారా? ఎప్పటికైనా రిస్కే.. ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధంగా వున్న సంస్థ

Big Stories

×